చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ ముందు ఇక సవాళ్లు: ఇంటాబయటా.. జయలలితలా సులువు కాదు

గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. జయలలిత వారసురాలిగా శశికళ నిరూపించుకోవడం అంత సులువు కాదు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అందరూ ఊహించినట్లుగానే శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టారు. చెన్నైలో గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. జయలలిత వారసురాలిగా శశికళ నిరూపించుకోవడం అంత సులువు కాదు.

ఇదీ చిన్నమ్మ: శశికళ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు..! ఇదీ చిన్నమ్మ: శశికళ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు..!

పార్టీ పగ్గాలు చేపట్టడం కన్నా అసలుసిసలు సవాళ్లు ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. అది జయలలిత ఎదుర్కొన్న రాజకీయ ప్రస్తానం కన్నా కష్టతరంగా ఉంటుందని అంటున్నారు.

పార్టీలో ఇబ్బందులు

పార్టీలో ఇబ్బందులు

నిన్నటి దాకా పార్టీలో జయలలిత ఏది చెబితే అదే. ఆమె ఎంత చెబితే అంతే. మంత్రులు, సీనియర్ నాయకులు కూడా ఆమె ముందు తల వంచేవారు. పార్టీ నేతలు ఆమె కాళ్లు కూడా తాకేవారు. ఆమెకు ఎదురు లేకుండా ఉండేది. కానీ శశికళ పరిస్థితి అలా కాదు.

పార్టీ నడపడం అంత ఈజీ కాదు

పార్టీ నడపడం అంత ఈజీ కాదు

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఏకతాటి పైన నడపడం ఆమెకు చాలా కష్టమని చెప్పవచ్చు. జయ కోడలు దీపా జయకుమార్ ఓవైపు, ఎంపీ శశికళ పుష్ప న్యాయపోరాటం మరోవైపు ఆమెకు ఇప్పటికే చిక్కులు ఉన్నాయి. అలాగే, పన్నీరు సెల్వం సహా, సీనియర్ నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో, పార్టీ కోసం వారు ఆమెకు అండగా నిలబడ్డారని చెప్పవచ్చు. భవిష్యత్తులో వారు తనకు ఎదురు తిరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

రాజకీయంగా సవాల్

రాజకీయంగా సవాల్

రాజకీయంగా జయలలిత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాటుదేలారు. ప్రతిపక్షాలు లేదా ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. కానీ శశికళ అందులో ఎంతవరకు నెగ్గుకు వస్తారో చెప్పడం కష్టమే. అన్నాడీఎంకే పార్టీలోని లుకలుకలను ప్రతిపక్ష డీఎంకే, బీజేపీ వంటి పార్టీలు కూడా సొమ్ము చేసుకునే అవకాశముంటుంది. జయ రాజకీయ వ్యూహచతురురాలు. మరి శశికళ విపక్షాల ఎత్తులకు పైఎత్తు వేయగలరా లేదా కాలమే తేల్చనుంది.

కేసులు

కేసులు

పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ.. ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోనే ఆమెకు ఉన్న వ్యతిరేకులు.. వివిధ కారణాలతో ఆమెను కోర్టుకు లాగవచ్చు. అలాగే, ఇప్పుడు ఉన్న కోర్టు కేసులు కూడా ఆమెకు చిక్కులే.

ఇంటా, బయటా సవాల్

ఇంటా, బయటా సవాల్

పార్టీలో ఇప్పటికే ఉన్న అసంతృప్తులను, తనను వ్యతిరేకిస్తున్న వారిని తట్టుకోవడం. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలబడిన వారు.. భవిష్యత్తులో తనకు ఎదురు తిరగకుండా చేసుకోవడం, అలాగే, పార్టీలోని ఆటుపోట్లను చూసి విపక్షాలు తనపై పైచేయి సాధించకుండా చూసుకోవడం.. ఇలా శశికళ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. జయలలితకు పార్టీలో తిరుగు లేదు. కానీ శశికళ పరిస్థితి మాత్రం అలా లేదు. ఆమె ఇంటా, బయటా వ్యూహాలకు పదును పెట్టాల్సిందే.

చరిష్మా

చరిష్మా

శశికళకు జయలలితకు ఉన్న ఛరిష్మా లేదు. జయకు ఉన్నంత రాజకీయ అనుభవం కూడా లేదు. ఎంజీఆర్ నాయకత్వంలో ఎన్నో ఏళ్లు పని చేసి, అపార రాజకీయ అనుభవాన్ని జయ కూడగట్టుకున్నారు. శశికళ కూడా జయ వెంటే దశాబ్దాల పాటు ఉన్నారు. ఆ పరిజ్ఞానం మాత్రం ఆమెకు ఉంది. అయితే, ఆమె ప్రజలను ఆకట్టుకోగలరా అనేది ప్రశ్న. మరోవైపు, కుటుంబ సభ్యులు పార్టీలో చక్రం తిప్పాలనుకుంటే అది శశికళకు ఇబ్బందికర పరిణామమే.

English summary
Moments after Sasikala Natarajan was appointed as the general secretary of the AIADMK through a resolution in the general body meet, posters of Sasikala popped up at the venue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X