వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశంలో తొలి ప్లాన్డ్ సిటీ జైపూర్: నాసా ఫొటోలో ఇలా..(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

Recommended Video

భారత్ లో తొలి ప్రణాళికా బద్ద నగరం జైపూర్ || Jaipur Is The First 'Planned' City In India Says Nasa

న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రణాళికా బద్దంగా నిర్మించిన మొట్టమొదటి నగరం జైపూర్ అని నాసా పంపిన ఉపగ్రహ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. అందమైన కట్టడాలతో ప్రపంచ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న జైపూర్ నగరాన్ని మహారాజా సావల్ జై సింగ్ నిర్మించారు. జైసింగ్ కారణంగానే ఆ నగరానికి జైపూర్ అనే పేరు వచ్చింది.

రాజా జైసింగ్ ఆసక్తి వల్లే..

రాజా జైసింగ్ ఆసక్తి వల్లే..

జైసింగ్ లానే భారతదేశపు చాలా మాంది రాజులు నిర్మాణం, ఖగోళ శాస్త్రంలపై ఎంతో మక్కువను చూపారు. వారి హయాంలో కట్టిన కట్టడాలను చూస్తే ఇది అర్థమవుతుంది. భారతదేశంలో చాలా నగరాలు, ప్రాంతాల్లో ఆయా రాజులు నిర్మించిన ఆలయాలు, భవనాలు ఇప్పటికీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ప్రణాళికా బద్దంగా..

ప్రణాళికా బద్దంగా..

మార్చి 18, 2019లో జైపూర్ ఎలా ఉందన్న ఫొటోను ల్యాండ్‌శాట్8 ఆపరేషన్ లాండ్ ఇమేజర్ పంపింది. కాగా, 1726లో నిర్మితమైన జైపూర్‌ను భారతదేశంలోనే తొలి ప్లాన్డ్ సిటీగా గుర్తింపు పొందింది. జైపూర్ నగరం ఒకేసారి చాలా ప్రణాళిక బద్దంగా నిర్మితమైంది. మిగితా నగరాల్లో మాత్రం క్రమంగా నిర్మాణాలు జరుగుతూ వచ్చాయి.

చుట్టూ కొండలు..

చుట్టూ కొండలు..

తన రాజ్యానికి జైపూర్‌ను రాజధానిగా నిర్ణయించుకున్నాడు రాజా జైసింగ్. అంబర్‌కు ఇది 11 కిలోమీటర్లు మాత్రమే ఉంది. వ్యాపార, వాణిజ్య నగరంగానూ సింగ్ జైపూర్‌ను అభివృద్ధి చేశారు. ట్రేడ్, కామర్స్ నగరంగా జైపూర్‌ను మార్చేశారు జైసింగ్. జైపూర్‌ను ఒక ఫ్లాట్ వ్యాలీలో నిర్మించారు. చుట్టూ ఉండే కొండలు నగరానికి రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. ఇక్కడే రక్షణ పోస్టులు, ఫోర్ట్స్ ఉంటాయి. చుట్టూ కొండలు ఉండే ఈ నగరాన్ని రాజా జైసింగ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు.

విద్యాధర్ భట్టాచర్య సాయంతో..

విద్యాధర్ భట్టాచర్య సాయంతో..

భారతదేశంలోని ప్రముఖ ఆర్చిటెక్చర్ అయిన విద్యాధర్ భట్టాచార్య సాయాన్ని వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం వంటి అంశాల్లో తీసుకున్నారు. వాస్తు శాస్త్ర అనే పేరుగల చారిత్రక హిందూ సిద్ధాంతం ఆధారంగా జైపూర్ నగర నిర్మాణానికి భట్టాచార్య తనవంతు సాయం అందించారు. లేఅవుట్స్ ఆఫ్ హౌసెస్, నగరాలు, పార్కులు, తోటలు కలిసి ప్రకృతి అందాన్ని మరింత పెంచుతోంది.

భారీ రక్షణ గోడలు..

భారీ రక్షణ గోడలు..

వాస్తు శాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా గ్రిడ్ లాంటి సిస్టమ్‌ మాదిరిగా జైసింగ్ జైపూర్ నగరాన్ని నిర్మించారు. సిటీని చతురస్త్రాలుగా విభజిస్తూ, విశాలమైన రోడ్లను ఏర్పాటు చేస్తూ నిర్మాణం చేపట్టారు. ఖగోలశాస్త్రంపై ఉన్న ఆసక్తితో నగరాన్ని 9 చతురస్త్రాలుగా విభజించారు. వేదిక్ ఆస్ట్రాలజీలోని 9గ్రహాలను ఈ 9 చతురస్త్రాలు సూచిస్తాయి. అంతేగాక, ఆక్రమణదారుల నుంచి నగరాన్ని రక్షించుకునేందుకు 6మీటర్ల ఎత్తుతో రక్షణ గోడలను కూడా నగరం చుట్టూ నిర్మించారు.

ప్రపంచంలో అతిపెద్దది..

ప్రపంచంలో అతిపెద్దది..

నగరానికి నలువైపులా గేట్లను నిర్మించారు. తూర్పున సూర్యుడు ఉదయించే సూర్యునికి సంకేతంగా భావిస్తే.. పడమర గేట్లు చంద్రుడి ప్రవేశానికి సంకేతాలుగా గుర్తించారు. ఆరు మీటర్ల ఎత్తుతో పలు మానుమెంట్స్‌తో రక్షణ గోడను పటిష్టంగా నిర్మించారు. ఎంతో ఆకర్షణీయంగా జంతర్ మంతర్ మహల్‌ను ఆయన నిర్మించారు. ఇందులో 20ఆస్ట్రానామికల్ పరికరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే రాతితో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదే కావడం గమనార్హం.

పింక్ సిటీ ఎందుకైందంటే..

పింక్ సిటీ ఎందుకైందంటే..

కవి కింగ్ సావాయి ప్రతాప్ సింగ్ ఐదు అంతస్తుల్లోని హవా మహల్‌ను నిర్మించారు. అంత:పురంలోని రాణులకు ధారాళంగా గాలి అందేందుకు ఈ హవా మహల్‌ను నిర్మించారు. కాగా, 1853లో ప్రిన్స్ వేల్స్ ఈ మహల్‌కు పింగ్ కలర్ వేయించారు. దీంతో ఈ నగరం పేరు పింక్ సిటీగా కూడా పేరు పొందింది. రాజస్థాన్ రాష్ట్రంలో పర్యాటకులకు మంచి మర్యాద ఉంటుందని పలువురు చెప్పారు. వారసత్వ, సాంస్కృతిక సంపదతో విలసిల్లుతున్న జైపూర్ నగరానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మిస్తున్నారు. జైపూర్‌ను జులై 2019లో యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.

English summary
There were few Indian rulers as passionate about architecture and astronomy as Maharaja Sawai Jai Singh, the founder of Jaipur, his namesake city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X