వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హార్దిక్ పటేల్ కు షాక్, శాంతిభద్రతలు, అమిత్ సొంత ఊరిలో సవాల్ కేసు నమోదు, పాపం !

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపిస్తూ పాటీదార్ వర్గం నాయకుడు హార్దిక్ పటేల్ మీద గుజరాత్ లోని గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీనగర్ లోని మాన్సాలో హార్దిక్ పటేల్ ఎలాంటి అనుమతి లేకుండా బహిరంగ సభ నిర్వహించాడని పోలీసులు అంటున్నారు.

హార్దిక్ పటేల్, ఉమియా డోకరేటర్స్ సంస్థ యజమాని ధర్మష్ పటేల్ తో సహ మొత్తం ఆరు మంది మీద ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశామని గాంధీనగర్ ఎస్పీ వీరేంద్ర సింగ్ యాదవ్ మీడియాకు చెప్పారు. హార్దిక్ పటేల్ బహిరంగ సభకు పోలీసులను అనుమతి కోరలేదని ఆరోపణలు ఉన్నాయి.

The Gandhinagar police has files against Patidar leader Hardik Patel

పోలీసులను ధిక్కరించి ఎన్నికల ప్రచారం చెయ్యడంతో శాంతిభద్రతలకు భంగం కలిగించారని హార్దిక్ పటేల్ మీద కేసు నమోద చేశామని గాంధీనగర్ ఎస్పీ వీరేంద్ర సింగ్ యాదవ్ మీడియాకు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సొంత ఊరు అయిన మాన్సాలో హార్దిక్ పటేల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్ లో బీజేపీ ఎలా అధికారంలోకి వస్తోందో మేమూ చూస్తామని హార్దిక్ పటేల్ అమిత్ షాకు ఆయన సొంత ఊరిలోనే సవాలు చేశారు. గత రెండేళ్లుగా హార్దిక్ పటేట్ పాటీదార్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. చాల సందర్బంల్లో పోలీసుల అనుమతి లేకుండా హార్దిక్ పటేట్ బహిరంగ సభలు నిర్వహించారని కేసులు నమోదు అయ్యాయి.

English summary
The Gandhinagar police has filed charges against Patidar leader Hardik Patel and six others for disturbing peace and breaking the law by holding a rally at Mansa despite not being given permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X