వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

75 నూతన మెడికల్ కాలేజీలు : కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

దేశంలో మరో 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వార అదనంగా 15,700 మెడికల్ సీట్లు పెరగనున్నన్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. కొత్త వైద్య కాలేజీలను రానున్న విద్యా సంవత్సరం నుండే ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 529 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో సుమారు 71వేల ఎంబీబీఎస్ ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న కాలేజీలు వైద్యసేవలు సరిగా లేని ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకు గాను 24,375 కోట్ల రుపాయాలను వెచ్చించనున్నట్టు జవదేకర్ చెప్పారు.

బుధవారం సాయంత్రం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రులు ప్రకాశ్ జవడేకర్‌తో పాటు పీయూష్ గోయల్ మీడీయాకు తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాల్లో ముఖ్యంగా దేశ వ్యాప్తంగా వైద్య సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

The government has decided to open 75 new medical colleges

మరోవైపు చెరుకు రైతులకు భారీ రాయితీలను ప్రకటించారు. వారికోసం రూ.6000 కోట్ల ఎగుమతి రాయితీలను ప్రకటించారు. కాగా ఈ రాయితీలను రైతులకు నేరుగా బ్యాంకులోనే వేయనున్నట్టు వెల్లడించారు. ఇక బోగ్గు ఉత్పత్తుల్లో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఇక ఇప్పటికే బ్రాండ్‌కాస్టింగ్ రంగంలో 49 శాతం ఎఫ్డీఐలను అనుమతించిన కేంద్రం తాజాగా మీడీయాలోని ప్రింట్‌ రంగానికి ప్రభుత్వ అనుమతితో 26శాతం ఎఫ్‌డీఐలను అనుమతించనున్నారు.మోదీ హయాంలో విదేశీ మారక నిల్వలు 280 మిలియన్‌ డార్లకు చేరాయని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. దీంతో పాటు జమ్ముకశ్మీర్‌ అభివృద్దికి సంభంధించి కూడ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

English summary
The Union Cabinet on Wednesday took a slew of decisions to boost jobs and farmers' income. After the meeting, Union minister Prakash Javadekar announced that the government has decided to open 75 new medical collages and allow 100 per cent FDI in coal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X