వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య మసీదు పిల్లర్ల క్రింద ముసళ్లు, తాబేళ్ల చిత్రాలు..ఇది ముస్లిం సంస్కృతికి విరుద్దం...!

|
Google Oneindia TeluguNews

అయోధ్య అంతకుముందున్న రామ మందిరాన్ని కూల్చే మసీదును నిర్మించారని అయోధ్య కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు వివరించారు. ఇందుకు సంబంధించి ఆర్కీయాలజీ నుండి తీసుకున్న సాక్ష్యాలను న్యాయవాదుల బృందానికి అందించారు. అయోధ్య వివాదంపై రోజువారిగా జరుగుతున్న విచారణలో భాగంగా ఎనిమిదో రోజు వాదనలు కొనసాగాయి.

గత ఎనిమిది రోజులుగా అయోధ్య భూ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం వాదనలు వింటుంది. ఈనేపథ్యంలోనే పిటిషన్ దారుల్లో ఒకరైన రాంలల్లా తరఫు న్యాయవాది ఈ వాదనలు వినిపించారు. సీనియార్ న్యాయవాది అయిన వైద్యనాథన్ రామమందిర నిర్మాణానికి సంబంధించిన పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ముఖ్యంగా ముస్లింల సంస్కృతిలో లేని ముసళ్లు, తాబేళ్లు స్థంబాల అడుగులో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన భారత పురావస్తుశాఖకు వద్ద ఉన్న ఆధారాలను న్యాయమూర్తుల బృందానికి సమర్పించారు.

The Hindu temple in Ayodhya was destroyed to construct a mosque at the disputed site

అయిదవ రోజు జరిగిన వాదనల్లో కూడ ఇందుకు అయోధ్య భూమి రాముడి జన్మస్థలమేనంటూ ఆయన వాధించారు. అయోధ్య నిర్మాణం ఎప్పుడు నిజమైన మసీదు స్ట్రక్ఛర్‌లో లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణం లోపలి బాగాలు కూడ ఇస్లాం మతానికి విరుద్దంగా ఉన్నాయని తెలిపారు.ఇక ఆలయ శిధిలాల పైన మసీదును నిర్మించడం ముస్లిం షరియత్ చట్టాలకు విరుద్దమని పేర్కోన్నారు. ఆర్కియాలజీ ద్వార తవ్వకాల్లో బయటపడిన నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను ఆయన న్యాయమూర్తుల బృందానికి అందించారు.

English summary
The Hindu temple in Ayodhya was destroyed to construct a mosque at the disputed site, said advocate for Ram Lalla Virajman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X