వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌కమ్ ట్యాక్స్: ఎర్రకోట నుంచి పన్ను చెల్లింపుదారులపై ప్రధాని మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆయుష్మాన్ భారత్‌పై ప్రధాని మోడీ ప్రకటన

న్యూఢిల్లీ: పన్ను సక్రమంగా చెల్లిస్తున్న వారిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. వారికి నేన ఒక్కటే చెప్పదలుచుకున్నానని, వారి కారణంగా ఎంతోమంది ఈ దేశంలో అన్నం తింటున్నారని చెప్పారు.

తాను తమ పన్నును చిత్తశుద్ధితో చెల్లిస్తున్న పన్ను చెల్లింపుదారులకు ఓ విషయం చెబుతున్నానని, వారి డబ్బులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఓ ట్యాక్స్ పేయర్ తాను తినేటప్పుడు తన వల్ల మరో మూడు కుటుంబాలు తన కారణంగా అన్నం తింటున్నాయని గర్వంగా ఫీల్ కావాలన్నారు.

ప్రధాని మోడీ ఆయుష్మాన్ భవ కూడా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. దీని వల్ల 50 కోట్లమంది ప్రజలకు లబ్ధి చేకూరునుంది. భారతదేశం ఓ సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందన్నారు.

The honest Indian taxpayer has a big role in the progress of the country: PM Modi from Red Fort

త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ దేశం ఒక ఆత్మవిశ్వసంతో ముందుకెళ్తోందని, స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం పరిశ్రమిస్తోందన్నారు.

నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తోందన్నారు. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోందన్నారు. ఏపీ, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్‌ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారన్నారు. ఎవరెస్టుపై మన బాలికలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆత్మవిశ్వాసాన్ని చాటారన్నారు.

పార్లమెంటు సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయని చెప్పారు. పేదలు, దళితులు, వెనుకబడి వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగిందన్నారు. సామాజిక న్యాయం దిశగానూ సమావేశాలు ఫలప్రదమయ్యాయన్నారు. దేశ రక్షణలో త్రవిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయని, త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్నానని చెప్పారు.

English summary
I want to tell honest tax payers, that it is their money that is being used for welfare schemes. An honest tax payer should feel that when he is eating food, three more poor families are eating because of tax payed by him, says Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X