వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ప్రభుత్వ చిన్న ఆలోచన..! గట్టెక్కిన 'చిల్లర' కష్టాలు..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్‌: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. అలాగే చిన్న ఆలోచన పెద్ద సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందంటారు. దేశంలో అచ్చం ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. పెద్ద నోట్లు రావడంతో చిల్లర నోట్ల కొరత పచ్చి పడ్డ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దిగువ మద్య తరగతి ప్రజాదనికం ఊపిరి పీల్చుకున్నంత పనవుతోంది. చిల్లరే కదా అని చిన్నచూపు వద్దు. ఒక్కోసారి అది లేకపోతే ఎక్కాల్సిన రైలు వదులుకోవాల్సి వస్తుంది. బస్సులోంచి అర్ధంతరంగా దిగేయాల్సి వస్తుంది. కావాల్సిన వస్తువు దక్కకపోవచ్చు..

ఇలాంటి చాలా సమస్యలు చిల్లరతో ముడిపడి ఉన్నాయి. కొంత కాలంగా నాణేల ముద్రణ లేక.. బ్యాంకులకు, దుకాణాలకు రాక 'చిల్లర' సమస్యలు వస్తున్నాయి. కొత్త బడ్జెట్‌లో కొత్త నాణేలు ముద్రిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. అతి త్వరలోనే కొత్త నాణేలు అందరికీ అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.

ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు చాలాచోట్ల చిల్లర సమస్య నగరవాసులకు ఎదురవుతోంది. చిల్లర లేని కారణంగా కొన్ని నిత్యావసరాలు కొనలేని పరిస్థితి వస్తుంది. అదే.. గ్రామాల్లో కొంత వెలుసుబాటు ఉంటుంది. ప్రస్తుతం బడ్జెట్‌లో చిల్లర నాణేలు కొత్తగా రానుండటం నగరవాసులకు కొంత ఊరటే అని చెప్పాలి.

The idea of ​​the central government.!Retailersproblem solved..!!

నాణేల కొరతను ఆసరాగా చేసుకొని కొందరు కమీషన్‌దారులు తక్కువ రోజుల్లోనే లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు పేపర్‌, పాల ప్యాకెట్టు తదితరాల నుంచి రాత్రి పడుకునే వరకు అంతా చిల్లరతో ముడిపడినవే. దీన్నే ఆసరాగా చేసుకొని కమీషన్‌దారులు తమ దందా కొనసాగిస్తున్నారు.

నూటికి 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కమీషన్‌ తీసుకుని చిల్లర ఇస్తున్నారు. చిల్లర వ్యాపారానికి నగరమే పెద్ద కేంద్రం. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వ్యాపారాలు నగరంపై ఆధారపడి లావాదేవీలు సాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో దుకాణాల వద్ద నాణేలు సేకరించి వాటిని ఎక్కువ ధరకు వేరే ప్రాంతాల్లోని వ్యాపారులకు అందజేస్తున్నారు.

చార్మినార్‌, బేగంబజార్‌, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, మలక్‌పేట, చైతన్యపురి, బేగంపేట, నాంపల్లి, అబిడ్స్‌ వంటి పలు ప్రాంతాల్లో చిల్లర నాణేల వ్యాపారం జోరుగా సాగుతోంది. భిక్షాట చేసేవారి నుంచి సేకరించి పెట్రోల్‌ బంకులు, రైతుబజార్లు, వీధిల్లో దుకాణదారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొత్త నాణేలు వస్తే ఇలాంటి సమస్య ఉండదని నగరవాసులకు అభిప్రాయపడుతున్నారు.

English summary
The Union Finance Minister said that the new coins were being printed in the new budget. It is announced that the new coins will be made available soon. City residents are facing a lot of retail problems until they move out of the house. The lack of retailers makes it impossible to buy some necessities. Yes .. there is some light in the villages. The current influx of retail coins into the budget is a bit of a blow to city dwellers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X