వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇచ్చిన కట్నం తీసుకోని వరుడు... కన్నీళ్లు పెట్టుకున్న వధువు... ఎందుకో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేసే ఓ వధువు కట్నం వద్దన్నాడు. దీంతో ఒక్కసారిగా వధువు తండ్రి ఖంగుతిన్నాడు. సాంకేతిక యుగంలో కూడ కట్నాల కోసం నానా యాగి చేస్తున్న రోజుల్లో పెళ్లి కొడుకు ఒక్కసారిగా కట్నం తీసుకోనంటూ మొండికేయడంతో పిల్లనిచ్చే మామ అవాక్కయ్యాడు. తాను ఏమైనా పెళ్లి వారికి తక్కువ చేశానే అనుమానాలు వచ్చాయి. అయితే ఎలాంటీ అనుమానాలు లేకుండా వరుడు పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. ఆయన కట్నం తీసుకోకపోవడం వెనక ఉన్న స్టోరీ అందరిని ఆకర్షించింది.

పెళ్లీ పీఠల మీద కట్నం వద్దన్న ప్రభుత్వ ఉద్యోగి

పెళ్లీ పీఠల మీద కట్నం వద్దన్న ప్రభుత్వ ఉద్యోగి

కట్నాలు లేకుండా పెళ్లిల్లు చేసుకున్నవారు చాలామందే ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ వారి ప్రస్తావన ఎందుకని అనుకొని తప్పులో కాలు వేయకండి... కట్నాలు తీసుకోమని ,కులాలు , మతాంతర వివాహాలు చేసుకున్న వారు సమాజంలో అనేక మంది ఉన్నారు. కాని.. వారంతా ముందుగానే నిర్ణయాలు తీసుకుని కట్నం వద్దనుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచివారి గురించి మీరు విని ఉంటారు. కాని ఇక్కడ ట్వీస్ట్ ఎంటంటే... ఇలాంటీ చర్చలు లేకుండా అరెంజ్ మ్యారేజ్‌లో జరిగిన సంఘటన ఇది. ఈ సంధర్భంలోనే పెళ్లి పీటల మీద వరుడికి ఇవ్వాలనుకున్న లక్షల రూపాయల కట్నాన్ని వద్దనుకుని కేవలం తమ సంప్రాదాయం ప్రకారమే 11 రూపాయలను అందులో నుండి తీసుకున్న సంఘటన రాజస్థాన్‌లో చేటుచేసుకుంది.

రూ.11 లక్షలు వద్దని రూ.11 కట్నంగా తీసుకున్న వరుడు

రూ.11 లక్షలు వద్దని రూ.11 కట్నంగా తీసుకున్న వరుడు

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన జితెందర్ సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఈనెల ఎనిమిదిన పెళ్లి జరిగింది. అయితే పెళ్లి సమయంలో అమ్మాయి తండ్రి కట్నంగా ఇవ్వాల్సిన 11 లక్షల రూపాయలన ఇవ్వబోయాడు. అయితే జితేందర్ సింగ్ మామ ఇస్తున్న కట్నాన్ని వెంటనే వద్దంటూ అక్కడున్న అందరిని ఖంగుతినేలా చేశాడు. దీంతో తనకు కట్నం వద్దని స్పష్టం చేశాడు. అయితే పదకొండు లక్షల రూపాయల నుండి కేవలం పదకొండు రూపాయాలు మరో కొబ్బరికాయను మాత్రమే తమ సంప్రాదాయం ప్రకారం తీసుకున్నాడు.

కట్నం తీసుకోకపోవడం వెనక స్టోరీ చెప్పిన వరుడు

కట్నం తీసుకోకపోవడం వెనక స్టోరీ చెప్పిన వరుడు

అయితే జీతేందర్ సింగ్ కట్నం తీసుకోకపోవడం వెనక తన ఆదర్శంతోపాటు ఆసక్తికర అంశాన్ని వారికి వివరించాడు. తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి రాష్ట్రంలో నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుందని అది కూడ న్యాయసంబంధించిన జ్యూడీషియల్ సర్వీసెస్‌కు సిద్దం అవుతుందని చెప్పాడు. ఇక ఆమె ప్రయత్నంలో ఒకవేళ మేజిస్ట్రేట్ అయితే అదే తనకు పెద్ద కట్నం అని వారికి వివరించాడు. తనకు డబ్బుకంటే కుటుంబ సంతోషమే ముఖ్యమని జితేందర్ సింగ్ తెలిపాడు.

కన్నీళ్లు పెట్టుకున్న వధువు

కన్నీళ్లు పెట్టుకున్న వధువు

మొత్తం మీద పెళ్లి కొడుకు నిర్ణయం ముందుగా అందరిని ఆశ్చర్యపరిచినప్పటికి..... వరుడు చెప్పిన స్టోరీకి పెళ్లికి వచ్చిన బంధువులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా వధువు సైతం ఆయన మాటలకు కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది. ఇక మరోవైపు వధువు తండ్రి సైతం ముందుగా కొంత ఇబ్బందిపడ్డానని చెప్పాడు. అల్లుడి నిర్ణయంతో కొంత షాక్‌కు గురయ్యాయని తెలిపాడు. పెళ్లి పనులకు సంబంధించి ఎదైనా తప్పు చేశానా అంటూ వాపోయాడు. అయితే జితేందర్ చెప్పిన తీయరీ విని సంతోషపడ్డానని చెప్పాడు.

English summary
A bride who works in the central government has not taken dowry. This was shocked the father of the bride groom after his decision
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X