వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ కు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు, విరాళాలు ఇచ్చేవారిని వేధిస్తున్నారు

తమకు సమర్పించిన జాబితాకు,పార్లీ వెబ్ సైట్ లో ఉన్న విరాళాలు ఇచ్చినవారి జాబితాకు మద్య వ్యత్యాసం ఉందని ఆదాయపు పన్ను శాఖ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు పంపింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం నిర్మూలనకు కేంద్రం చర్యలు తీసుకొంటుంది.అయితే కొన్ని కాగితాలకే పరమితమైన రాజకీయ పార్టీలు నల్ల ధనాన్ని మార్పిడిచేసేందుకు అక్రమ మార్గాలను ఎంచుకొన్నాయని తేల్చింది ఎన్నికల కమీషన్ .అయితే ఆమ్ ఆద్మీ పార్టీ తమకు సమర్పించిన జాబితాకు, పార్టీ వెబ్ సైట్ లో ఉంచిన జాబితాకు మద్య తేడా ఉందని ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనాన్ని మార్చుకొనేందుకు కొందరు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్టుగా నల్లధనాన్ని మార్పిడి చేసుకొన్నారని ఎన్నికల సంఘం అనుమానాలు వ్యక్తం చేసింది.

ఈ మేరకు కాగితాలకే పరిమితమైన సుమారు రెండువందలకు పైగా పార్టీలపై వేటు వేసింది. అయితే రాజకీయపార్టీలకు విరాళాలు ఇచ్చే వారు 20 వేల రూపాయాలకు పైగా విరాళాలు చెల్లిస్తేనే వారి వివరాలను ఇస్తేనే వారి వివరాలను బయటకు వెల్లడించే అవకాశం ఉంటుంది.

అయితే మరో వైపు చట్టాన్ని సవరించాలని కోరుతోంది కేంద్ర ఎన్నికల సంఘం..రెండువేలకు పైగా విరాళాలను చెల్లించేవారి వివరాలను కూడ బహిర్గతంచేసేలా చట్టాన్ని మార్చాలని కేంద్రాన్ని కోరింది ఎన్నికల సంఘం.

 విరాళాలపై ఆప్ కు నోటీసులిచ్చిన ఐటిశాఖ

విరాళాలపై ఆప్ కు నోటీసులిచ్చిన ఐటిశాఖ

తమకు సమర్పించిన జాబితాకు, పార్టీ వెబ్ సైట్ లో ఉన్న జాబితాకు పొంతన లేదని ఆదాయపు పన్నుశాఖాధికారులు ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అధికారిక వైబ్ సైట్ నుండి విరాళాలు ఇచ్చినవారి పేర్లను ఎందుకు తొలగించారో చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.తమకు విరాళాలు ఇచ్చేవారిని ఎన్ డి ఏ వేధిస్తోందని ఆప్ ఆరోపణలు గుప్పించింది. అయితే ఆదాయపు పన్నుశాఖకు పంపిన జాబితాలో తప్పులు చోటుచేసుకొన్నాయని ఆప్ అభిప్రాయపడింది. నోటీసులు అందుకొన్న తర్వాత ఐటిఐఆర్ లో సవరించుకొన్నామని వారు వివరించారు.

బిఎస్ పి ఖాతాలో నగదు పై మాయా ఆగ్రహం

బిఎస్ పి ఖాతాలో నగదు పై మాయా ఆగ్రహం

వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో విరాళాలు సేకరిస్తోన్న సమయంలోనే పెద్ద నగదు నోట్లను కేంద్రం రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది. తమ ఖాతాలో జమ అయిన ప్రతి పైసాకు ఆధారాలున్నాయని బిఎస్ పి అధినేత్రి మాయావతి చెప్పారు. ఈ మేరకు ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమను అప్రతిష్టపాల్జేసేందుకే కేంద్రం ఈ రకంగా తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించారు.

 ప్రతిపక్షాలకు తిప్పలు

ప్రతిపక్షాలకు తిప్పలు

ఎన్నికల సంఘం నిఘాతో పాటు పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో అన్ని రాజకీయపార్టీలకు విరాళాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కొంత విరాళాల విషయంలో ఇతర పార్టీల కంటే కొత మెరుగ్గానే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 84 శాతం విరాళాలు తగ్గిపోయాయి. కేవలం 16 శాతం మాత్రమే రాజకీయపార్టీలకు విరాళాలు వచ్చాయి.బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఈ ఏడాది ఎక్కువగా విరాళాలు సేకరించిన పార్టీలో బిజెపి అగ్రస్థానంలో ఉంది.

 చట్టంలో మార్పుతో పార్టీలకు కష్టాలే

చట్టంలో మార్పుతో పార్టీలకు కష్టాలే

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విషయంలో ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మార్చాలని ఎన్నికల సంఘం కోరుతోంది. 20 వేలకు పైగా విరాళాలు ఇచ్చేవారి సమాచారం మాత్రమే రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి. అయితే 20 వేల కంటే తక్కువగా విరాళాలు ఇచ్చేవారి పేర్లను బహిర్గత పర్చాల్సిన అవసరం లేదు.అయితే దీన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు రాజకీయపార్టీలకు విరాళాలు చెల్లిస్తున్నారు.అయితే చట్టాన్ని మార్చడం ద్వారా కొంత విరాళాల ముసుగులో జరిగే నల్లధనం మార్పిడిని అరికట్టవచ్చనే అభిప్రాయంతో ఎన్నికల సంఘం ఉంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. రెండువేల రూపాయాల నుండి విరాళాలు చెల్లించినవారి సమాచారాన్ని ఇచ్చేలా మార్పిడి చేయాలని కోరుతోంది ఎన్నికల సంఘం.

English summary
the income tax department has issued a notice to aam Aadmi party, citing discrepancies in the donors' list submitted to tax officials and what had been put up on the party website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X