వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది దెబ్బ: దినకరన్ టార్గెట్: ఆర్ కే నగర్ లో ఐటీ శాఖ దాడులు !

శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్న ఆర్ కే నగర్ నియోజక వర్గంపై ఎన్నికల కమిషన్ అధికారులు డేగ కన్ను వేశారు. ఆర్ కే నగర్ లో నివాసం ఉంటున్న దినకరన్ అనుచరుడు రామచంద్రన్ ఇంటిపై ఐటీ శాఖ అధికారు

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి టీటీవీ దినకరన్ పై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్న దినకరన్ ప్లాన్ లు బెడిసికొడుతున్నాయి.

దినకరన్ కు భారీ దెబ్బ: గిఫ్ట్, డబ్బులు ఇస్తూ అడ్డంగా, పరుగో పరుగు !దినకరన్ కు భారీ దెబ్బ: గిఫ్ట్, డబ్బులు ఇస్తూ అడ్డంగా, పరుగో పరుగు !

దినకరన్ అనుచరుడు, శశికళ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ నాయకుడు అయిన ఆర్ కే నగర్ నివాసి రామచంద్రన్ ఇంటిపై సోమవారం ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడి చేశారు. రామచంద్రన్ ఇంటిలో సోదాలు చేస్తున్నారు.

The Income Tax officials raided the house of Dinakaran's supporter Ramachandaran at RK Nagar.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా దినకరన్ అనుచరులు ఇష్టం వచ్చినట్లు నగదు, విలువైన బహుమతులు పంచిపెడుతూ ఓటర్లను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడ పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

బెంగళూరు జైళ్లో శశికళకు సినిమా కష్టాలు: అదే ఫుడ్, దోమల బెడద, నిద్రలేక !బెంగళూరు జైళ్లో శశికళకు సినిమా కష్టాలు: అదే ఫుడ్, దోమల బెడద, నిద్రలేక !

ఈ నేపధ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దినకరన్ అనుచరుల మీద ప్రత్యేక దృష్టిసారించారు. రామచంద్రన్ ఇంటిలో పలు డాక్యుమెంట్లు పరిశీలించి అతన్ని విచారిస్తున్నారు. రామచంద్రన్ ను ఐటీ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని ప్రజలకు డబ్బు, విలువైన బహుమతులు పంచిపెడుతున్న దినకరన్ అనుచరులు శివకుమార్, ప్రసన్న, కరుణమూర్తి అనే ముగ్గురు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఇప్పుడు రామచంద్రన్ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చెయ్యడంతో దినకరన్ అనునచరులు హడలిపోతున్నారు.

English summary
The Income Tax officials raided the house of ADMK (Amma)candidate TTV Dinakaran's supporter Ramachandaran at RK Nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X