వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 వారాల్లో... 10 మంది పాకిస్థాన్ కమాండోలను హతమార్చిన ఇండియన్ ఆర్మీ

|
Google Oneindia TeluguNews

ఆర్టికల్ 370 రద్దు నుండి నేటి వరకు మొత్తం పదిమంది పాకిస్థాన్ కమాండోలను హతం చేసినట్టు సమాచారం. ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్‌ సైన్యం సహకారంతో భారత్‌కి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పలు సార్లు కాల్పులు జరిగాయి. ఈనేపథ్యంలోనే ఆగస్టు 5 నుండి నేటి వరకు పదిమంది పాకిస్థాన్ కమాండోలను హతం చేసినట్టు భారత భద్రతా దళాలు వెల్లడించాయి.

జమ్ము కశ్మీర్‌లో పరిణామాల తర్వాత కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్థాన్ కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయం చేసేందుకు కుట్రలు పన్నతున్న విషయం తెలిసిందే..దీంతోపాటు భారత్‌లో అర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేయడం, కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే భారత్‌లో చొరబాటుకు పలువురు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. మరోవైపు లైన్ ఆఫ్ కట్రోల్ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని కాలరాసి కాల్పులు సైతం తెగపడింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు పాకిస్థాన్ కుట్రలను తిప్పికొట్టాయి. ఇందులో భాగంగానే మూడు వారాల్లోనే 10 మంది పాకిస్థాన్ కమాండోలను హతమార్చినట్టు తెలుస్తోంది. హతమైన కమాండోల్లొ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్థాన్‌లో పట్టుకుని చిత్రహింసలకు గురి చేసిన కమాండర్ కూడ ఉండడం విశేషం...

The Indian Army has killed over 10 Pakistan Army commandos over last three weeks,

మరోవైపు మరో వందమంది పాకిస్థాన్ కమాండోలను లైన్ ఆఫ్ కంట్రోల్‌కు తాజాగా తరలించినట్టు సమాచారం. దీంతో రెండు దేశాల సరిహద్దుల వెంట ఉత్కంఠ వాతవరణం నెలకోంది. ఇక భారత దేశంతో యుద్దం చేస్తామంటూ అది కూడ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఉంటుందని పాకిస్థాన్ నేతలు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఇండియా పాకిస్థాన్‌ల మధ్య యుద్దాలు జరిగినప్పటికి ఇది చివరి యుద్దమవుతుందని కూడ పాకిస్థాన్ ప్రకటించింది. ఇక పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను చేధించేందుకు భారత భద్రతా దళాలు కూడ అప్రమత్తంగా ఉన్నాయని ప్రకటించారు.

English summary
in the last three weeks, the Indian Army has killed over 10 Pakistan Army commandos in retaliatory action along the Line of Control since the abrogation of Article 370 in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X