వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిపా వైరస్‌కు మందు ఉంది!: హోమియోపతి వైద్యులు, ఈ వైరస్‌కు కారణం గబ్బిలాలు కాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిపా వైరస్‌కు మెడిసిన్ ఉందని ఇండియన్ హోమియోపతి మెడికల్ అసోసియేషన్ - కేరళ యూనిట్ తెలిపింది. అన్ని రకాల జ్వరాలకు అవసరమైన మందులు ఉన్నాయని, కానీ వ్యాధి కలిగిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు తమను అనుమతించాలన్నారు. ఈ మేరకు వారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రికి ఓ విజ్ఞప్తి చేశారు. పేషెంట్లను పరీక్షించేందుకు తమ వైద్య నిపుణులకు అనుమతివ్వాలని కోరారు.

నిపా వైరస్ కేవలం అంతటా భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దాని దాటికి కేరళలో 17 మంది వరకు మృతి చెందారు. కానీ దీని విజృంభనకు సరైన కారణాలు నిర్ధారించలేకపోతున్నారు. అయితే నిపా వైరస్‌ బయటపడిన వెంటనే దానికి పండ్లపై వాలే గబ్బిలాలు(ఫ్రూట్‌ బ్యాట్‌) కారణమనే వార్తలు వినిపించాయి. దీనిపై కేరళ చర్యలు కూడా తీసుకుంది.

The Indian Homeopathic Medical Associations Kerala unit has claimed to have the medicines to treat Nipah virus.

ఈ నేపథ్యంలో ఈ ఫ్రూట్‌ బ్యాట్లకు చెందిన 13 నమూనాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపారు. ఈ నమూనాలను పరీక్షించిన ఈ సంస్థ వీటిలో నిపాను కలిగించే లక్షణాలు లేవని తేల్చారు. దీంతోపాటు ఎలుకల నమూనాలను కూడా పరీక్షించినా, నిపా వైరస్ వ్యాప్తి లక్షణాలు లేవని తేలింది. పందులు, మేకలు, గేదెలు వంటి పశువుల నమూనాల్లోనూ నెగటివ్‌ అనే వచ్చింది.

దీనిపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడారు. నిపా వైరస్‌ కారకాలుగా అనుమానించిన అన్ని నమూనాలను ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీకు పంపామని, అన్నింట్లోనూ నెగటివ్‌ అనే తేలిందని, దీంతో నిఫా వైరస్ వ్యాప్తికిగల కారణాన్ని అన్వేషించడానికి మరో ప్రయత్నం మొదలు పెట్టామని, త్వరలోనే దీనికి గల కారణాలు కనుక్కొని సమూలంగా నియంత్రిస్తామన్నారు.

English summary
The Indian Homeopathic Medical Association's Kerala unit has claimed to have the medicines to treat Nipah virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X