వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమానుషం...భిక్షాటన చేస్తున్నాడని 5 ఏళ్ళ బాలుడ్ని చెట్టుకు కట్టేసిన టోల్ ప్లాజా సిబ్బంది

|
Google Oneindia TeluguNews

లూధియానా దగ్గరలోని లడోవాల్ టోల్ ప్లాజా సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల బాలుడిని టోల్ ప్లాజా వద్ద వాహనాల వెంటపడి యాచనకు పాల్పడుతున్నాడన్న కారణంతో చెట్టుకు బంధించారు సిబ్బంది. అన్నెం పున్నెం ఎరుగని ఆ చిన్నారి బాలుడిని అమానవీయంగా తాళ్ళతో చెట్టుకు బంధించిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది . టోల్ ప్లాజా సిబ్బంది ముక్కుపచ్చలారని ఐదు సంవత్సరాల బాలుడ్ని చెట్టుకు బంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అత్యంత అమానుషంగా బాలుడిని తాళ్లతో బంధించిన సిబ్బంది నిర్వాకం బాలల హక్కుల పరిరక్షణ పై ప్రశ్నలను సంధిస్తుంది.

ఐదు సంవత్సరాల బాలుడిని చెట్టుకు కట్టేసిన టోల్ ప్లాజా సిబ్బంది

ఐదు సంవత్సరాల బాలుడిని చెట్టుకు కట్టేసిన టోల్ ప్లాజా సిబ్బంది

స్థానికుల కథనం ప్రకారం లుధియానా సమీపంలోని లడోవాల్ టోల్ ప్లాజా దగ్గర ఐదు సంవత్సరాల బాలుడు బిక్షాటన చేస్తున్నాడు. అతను టోల్ ప్లాజా దగ్గర ఆగిన వాహనాల వెంటపడి డబ్బుల కోసం యాచన చేస్తున్న క్రమంలో టోల్ ప్లాజా సిబ్బంది ఆ బాలుడిని అక్కడినుంచి పంపించాల్సింది పోయి, అమానుషంగా చెట్టుకు కట్టేశారు. తాళ్లతో గట్టిగా బాలుడిని చెట్టుకు కట్టేయడం వల్ల బాలుడి చేతులపై తాళ్ళు వత్తుకుని ఎర్రగా కందినట్లు గా మరకలు పడ్డాయి.

టోల్ ప్లాజా వద్ద భిక్షాటన చేయడమే కారణం... సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సిబ్బంది నిర్వాకం

టోల్ ప్లాజా వద్ద భిక్షాటన చేయడమే కారణం... సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సిబ్బంది నిర్వాకం

చిన్నారిని బంధించడం గుర్తించిన కొందరు వాహన యజమానులు ఆ బాలుని విడిపించి టోల్ ప్లాజా అథారిటీకి ఫిర్యాదు చేశారు. చిన్న పిల్లవాడు అన్న జాలి కూడా లేకుండా టోల్ ప్లాజా సిబ్బంది చేసిన నిర్వాకం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిక్షాటన లో భాగంగా వాహనాల వెంట డబ్బుల కోసం పరుగులు పెడుతున్న కారణంగానే ఆ బాలుడిని బంధించినట్లు గా తెలుస్తుంది. అంతేకాకుండా యాచన ద్వారా అతను సంపాదించిన డబ్బును టోల్ ప్లాజా సిబ్బంది తీసుకున్నట్లుగా కూడా వాహన యజమానులు చెప్తున్నారు.

ఫిర్యాదు అందితేనే చర్య తీసుకుంటామన్న పోలీసులు.. బాలల హక్కుల రక్షణ ఇదేనా

ఫిర్యాదు అందితేనే చర్య తీసుకుంటామన్న పోలీసులు.. బాలల హక్కుల రక్షణ ఇదేనా

ఇదే విషయంపై లుధియానా డి సి పి జగన్ అజిత్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియోలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ సంఘటనపైన ఫిర్యాదు అందితే టోల్ ప్లాజా సిబ్బందిపై చర్యలకు ఉపక్రమిస్తామని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై మాట్లాడడానికి టోల్ ప్లాజా అథారిటీ విముఖత వ్యక్తం చేస్తుంది. మరోవైపు పిర్యాదు వచ్చేవరకు చర్యలు తీసుకోలేమన్న పోలీసుల తీరుతో ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఏది ఏమైనా బాలల హక్కుల పరిరక్షణకు విఘాతం కలిగిస్తూ చిన్న పిల్లవాడు అన్న మానవీయ కోణం కూడా లేకుండా అమానుషంగా ప్రవర్తించిన టోల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికుల నుండి డిమాండ్ వినిపిస్తోంది.

English summary
In a shocking video gone viral on social media, employees of the Ladowal toll plaza near Ludhiana tied a child beggar to a tree because he was running after vehicles.The viral video shows unidentified men untying the child who appears to be around five-year-old.According to eyewitnesses, a couple of vehicle owners noticed the child tied to tree when they rescued him and informed the toll authorities. that the child would have been run over by the moving vehicles as he was chasing them for money, which is why they tied him to a tree instead of sending him away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X