వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపీఎల్ స్కాం: సీబీఐ vs ఇంటర్ పోల్ (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

లిస్బన్/ముంబై: ఐపీఎల్ ప్రసార హక్కుల కుంభకోణం వ్యవహారంలో ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారా, లేక కావాలనే రాజకీయ కక్షల కారణంగా కేసులో ఇరికించారా, మీరు పెట్టిన అభియోగాల్లో వాస్తవం ఎంత అంటూ చెప్పాలని ఇంటర్ పోల్ సీబీఐని కోరింది.

లలిత్ మోడీ వ్యవహారం గురించి మీ దగ్గర ఎలాంటి ఆదారాలు ఉన్నాయో మాకు వారంలోపు ఇవ్వాలని ఇంటర్ పోల్ సీబీఐని కోరింది. ఇంటర్ పోల్ తెరమీదకు తెచ్చిన ఈ వివాదంతో సీబీఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ దేశం విడిచి పరారైనాడు. ప్రస్తుతం అతను పోర్చుగల్ దేశంలో తలదాచుకున్నాడు. లలిత్ మోడీపై గత ఆగస్గు నెలలో ఈడీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.

ఇంటర్ పోల్ ఎంటర్

ఇంటర్ పోల్ ఎంటర్

రెడ్ కార్నర్ నోటీసులు జారీ చెయ్యడంతో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్ పోల్ లలిత్ మోడీ కేసు వివరాలు తెలుసుకునింది.

నేను అమాయకుడిని

నేను అమాయకుడిని

ఓ కేంద్ర మంత్రితో సహ బీసీసీఐ పెద్దలు కొందరు తన మీద కావాలనే తప్పుడు కేసులు పెట్టి ఇరికించారని, తనను అందరూ టార్గెట్ చేసుకున్నారని లలిత్ మోడీ ఇంటర్ పోల్ ను ఆశ్రయించారు.

నోటీసులు ఇవ్వద్దు

నోటీసులు ఇవ్వద్దు

ఈడీ ఆరోపణల ఆదారంగా తనకు నోటీసులు జారీ చెయ్యరాదని లలిత్ మోడీ ఇంటర్ పోల్ కు మనవి చేశారు.

పరిశీలించిన ఇంటర్ పోల్

పరిశీలించిన ఇంటర్ పోల్

లలిత్ మోడీ అప్పీలను ఇంటర్ పోల్ పరిశీలించింది. కేసు ప్రేరితమా ? కాదా అనే ప్రశ్నలు తెరమీదకు తెచ్చింది.

వచ్చే వారం విచారణ

వచ్చే వారం విచారణ

లలిత్ మోడీ అప్పీళ్లపై వచ్చే వారంలో ఇంటర్ పోల్ లో విచారణ జరగనుంది. అంతలోపు సమాధానం ఇవ్వాలని ఇంటర్ పోల్ సీబీఐకి మనవి చేసింది.

ఈడీ విదేశాలకు సమాచారం ఇవ్వదు

ఈడీ విదేశాలకు సమాచారం ఇవ్వదు

ఎలాంటి కేసులైనా భారతీయ కోర్టులకు తప్పా అంతర్జాతీయ సంస్థలకు ఈడీ దర్యాప్తు వివరాలు ఇవ్వదు. అలాంటిది ఈ విషయం తెలిసినా ఇంటర్ పోల్ ఈడీని ఆదారాలు ఇవ్వాలని కోరుతుంది.

లలిత్ మోడీ మైండ్ గేమ్

లలిత్ మోడీ మైండ్ గేమ్

లలిత్ మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నాడని స్పష్టంగా వెలుగు చూసింది. ఏదో ఒక విషయాన్ని ఇంటర్ పోల్ ముందు పెడుతున్నారు. దానికి సమాధానం చెప్పాలని ఇంటర్ పోల్ కోరుతుంది.

రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది ఈడీనే

రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది ఈడీనే

లలిత్ మోడీకి గత ఆగస్టు నెలలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది ఈడీనే

సీబీఐ నోడల్ ఏజెన్సీ

సీబీఐ నోడల్ ఏజెన్సీ

ఇంటర్ పోల్ కు భారత్ లో సీబీఐ నోడల్ ఏజెన్సీగా పని చేస్తున్నది. అందు వలన ఆ సంస్థ ద్వారానే ఈడీ నుంచి సమాచారం సేకరించి పంపాలని ఇంటర్ పోల్ కోరింది.

తప్పించుకోవడానికి ప్లాన్

తప్పించుకోవడానికి ప్లాన్

లలిత్ మోడీ ఎలాగైనా ఈ కేసుల నుంచి తప్పించుకోవాలని రకరకాలుగా ప్లాన్ లు వేస్తున్నాడు. అతను అన్ని సమస్యల నుంచి తప్పించుకుంటూ ఈడీకి చుక్కలు చూపిస్తున్నాడు.

English summary
With no forward steps taken by the Interpol in issuing a red corner notice against Lalit Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X