వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగువలకు మత్తిచ్చే న్యూస్: ఉమెన్ స్పెషల్ లిక్కర్ షాప్స్

|
Google Oneindia TeluguNews

కాలం మారిపోయింది. ఒకప్పుడు మగవాళ్ళు తాగితేనే తప్పు అనుకునే కాలం నుండి ఇప్పుడు మహిళలు తాగితే తప్పేంటి అనే దాకా పరిస్థితులు మారాయి. అందుకు తగ్గట్టు ప్రభుత్వాల ఆలోచనలు కూడా మారుతున్నాయి. వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ది ఫన్ అనే ట్యాగ్‌లైన్‌ను హీరోయిన్ ప్రియాంక చోప్రా అప్పుడెప్పుడో ఒక కమర్షియల్ యాడ్‌లో చెప్పినట్లు ఇప్పుడు మగవారికి మాత్రమే మద్యం షాపులు ఎందుకు ...మహిళలకు ఎందుకు మద్యం షాపులు ఉండకూడదు అని భావించిన మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

మగువల కోసం మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయం .. మహిళా లిక్కర్ షాపులు

మగువల కోసం మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయం .. మహిళా లిక్కర్ షాపులు

ఇప్పుడు మగువలు కూడా మందేసి చిందేసేందుకు, ఎంజాయ్ చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా స్పెషల్ లిక్కర్ షాపులను అందుబాటులోకి తెస్తుంది. . ముఖ్యంగా మద్యం తాగే అలవాటు ఉన్న మహిళలకు ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాప్స్ ఏర్పాటు చెయ్యనున్నారు . మద్యం తాగే మహిళలు ఇబ్బంది పడకుండా దర్జాగా మహిళా మద్యం షాపుల్లో లిక్కర్ కొనుగోలు చేసి తాగొచ్చు . కమల్‌నాధ్ సర్కార్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం తాగుడు అలవాటు ఉన్న మహిళలకు గుడ్ న్యూస్. కానీ వీటిపై విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపుల ఏర్పాటుకు సన్నాహాలు

ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపుల ఏర్పాటుకు సన్నాహాలు

ఇక ఏది ఏమైనా మధ్య ప్రదేశ్ సర్కార్ త్వరలోనే ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపుల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టింది. భోపాల్, ఇండోర్‌లలో రెండు షాపులు అలాగే గ్వాలియర్‌, జబల్‌పూర్ లో కూడా రెండు లిక్కర్ షాప్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఓన్లీ ఫర్ లేడీస్ కోసం ఏర్పాటు చేస్తున్న ఈ షాపుల్లో ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్‌ను మాత్రమే అమ్ముతారని సమాచారం . మగువలు ఎక్కువగా ఇష్టపడే వైన్, విస్కీ బ్రాండ్లను వీటిల్లో విక్రయిస్తారని తెలుస్తోంది.

Recommended Video

Viral Video : A Bhopal Man Smashes Helicopter With Stones ! | Oneindia Telugu
మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకునే ఆలోచన

మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకునే ఆలోచన

మహిళలకు సైతం సమన్యాయం పాటించేలా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మహిళలను చెడగొట్టే నిర్ణయం అని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ మద్యం విక్రయాల ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టేందుకే మధ్యప్రదేశ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపులతో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైన్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించటం చేస్తూ మద్యంపై అధిక ఆదాయాన్ని ఆర్జించాలని ప్రయత్నం చేస్తుంది.

English summary
The Madhya Pradesh Government is soon preparing for the creation of Women Friendly Liquor Shops. Two Liquor Shops will be set up in Bhopal and Indore as well as in Jabalpur and Gwalior. It is reported that these shops are only for sale by Foreign Liquor Brands. known to sell the most sought wine and whiskey brands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X