వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: గోవాలో లాక్ డౌన్, ఆగస్టు వరకు కర్ఫ్యూ, సీన్ సితారా, బీచ్ లో పొలోమంటూ పాటు !

|
Google Oneindia TeluguNews

గోవా/ పణజి: ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం గోవాలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ఈ దెబ్బకు గోవాలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. అంతే కాకుండా గురువారం నుంచి ఆగస్టు 10వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ప్రతిరోజు రాత్రి పూర్తిగా కర్ఫ్యూ అమలు చేస్తామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. గోవాలోని బీచ్ లో పర్యాటకులు సంచరించడానికి ఈనెల 2వ తేదీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పొలోమంటూ బీచ్ లో హల్ చల్ చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో గోవా ప్రభుత్వం ఉలిక్కిపడింది.

Ex-lover blackmail: ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ లకు నేను రెఢీ, నగ్న వీడియోలతో టార్చర్, థర్డ్ డిగ్రీతో !

 ఒక్కరోజులో పాజిటివ్ కేసులతో హడల్

ఒక్కరోజులో పాజిటివ్ కేసులతో హడల్

గోవాలో మంగళవారం ఒక్కరోజే 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఈ దెబ్బతో గోవా ప్రభుత్వం ఉలిక్కిపడింది. జులై నెల మద్యలో మనం ఉన్నామని, ఇక ముందు గోవాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, కరోనా వైరస్ అంటు వ్యాధిలా వ్యాపించే అవకాశం ఉన్నందున మనం అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే మొదటికే మోసం వస్తోందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 గోవాలో లాక్ పడింది

గోవాలో లాక్ పడింది

గోవాలో ప్రతివారం శుక్ర, శని, ఆదివారాలు సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంటుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. వైద్య సేవలు మినహాయించి ఎలాంటి వ్యాపారలావాదేవీలు జరకుండా చూడాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీదకు వచ్చినా, వాహనాల్లో హల్ చల్ చేసినా ఎత్తిలోపల వేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 ఆగస్టు వరకు కర్ఫ్యూ

ఆగస్టు వరకు కర్ఫ్యూ

గోవాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచించారని, అందువలన కరోనా మహమ్మారి వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. గురువారం రాత్రి నుంచి ఆగస్టు 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు ప్రతిరోజు రాత్రిపూర్తిగా కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలు సహకరించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ మనవి చేశారు.

 మేము ఊహించలేదు

మేము ఊహించలేదు

గోవాలో నేటి వరకు 2, 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ వ్యాధితో పోరాటం చేసి 1, 607 మంది చికిత్స పొంది వ్యాధి నయం చేసుకుని ఇళ్లకు వెళ్లారు. గోవాలో ఇంకా 1, 128 మంది కరోనా వ్యాధితో పోరాటం చేస్తున్నారని, ఈ వ్యాధి కేసులు పెరిగిపోయే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కరోనా వ్యాధి మరింత వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Bubonic Plague : అమెరికాలో ఉడుతకు Bubonic Plague పాజిటివ్‌! || Oneindia Telugu
 రెండు వారాలకే సీన్ సితారా

రెండు వారాలకే సీన్ సితారా

ఈనెల 2వ తేదీ నుంచి గోవాలో పర్యాటకులు సంచరించడానికి అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోవాలోకి వచ్చే పర్యాటకులకు అక్కడి పర్యాటక శాఖా మంత్రి మనోహర్ అజ్గనోగర్ అనేక నియమాలు పెట్టారు. పర్యాటకులు సంచరించడానికి అనుమతి ఇచ్చిన రెండు వారాల్లోనే అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఈ దెబ్బతో పర్యాటకులను కట్టడి చెయ్యడానికి, కరోనా వైరస్ కు కళ్లెం వెయ్యడానికి గోవా ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యింది.

English summary
Coronavirus: The Janta Curfew will be observed from today in Goa. Complete lockdown will be imposed on Friday, Saturday & Sunday this week: Pramod Sawant, Goa Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X