వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ జవాన్ ను ఉరి తీసినా తప్పులేదు..! పాక్‌ మహిళకు సైనిక రహస్యాలు చెప్పిన స్కౌండ్రల్..!!

|
Google Oneindia TeluguNews

భోపాల్‌/హైదరాబాద్ : పాకిస్థాన్‌కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాను, సైనిక రహస్యాలను ఆమెకు, తద్వారా పాక్‌ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచారంతోనే ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి, 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్‌), కేంద్ర నిఘా సంస్థలు చేసిన దర్యాప్తులో ఈ సంచలన విషయం వెలుగుచూసింది.

 ఆ సమాచారంతోనే పుల్వామా ఉగ్రదాడి..! ఆ జవాన్ ను పబ్లిక్ గా కాల్చేయాలంటున్న పబ్లిక్..!!

ఆ సమాచారంతోనే పుల్వామా ఉగ్రదాడి..! ఆ జవాన్ ను పబ్లిక్ గా కాల్చేయాలంటున్న పబ్లిక్..!!


ఇండోర్‌ సమీపంలోని మోహో పట్టణంలో బిహార్‌ రెజిమెంట్‌లో నాయక్‌ క్లర్కుగా ఇరవై ఐదేళ్ల అవినాశ్‌ కుమార్‌ అనే యువకుడు పనిచేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో అతడికి వాట్సా‌ప్ లో ఓ పాకిస్థాన్‌ యువతితో పరిచయం ఏర్పడింది. అంద చందాలతో అవినాశ్‌ను వలలో వేసుకున్న ఆమె.. సైనిక రహస్యాలను అతడి వద్ద కూపీ లాగి ఉగ్రవాదులకు చేరవేసేది.

అవినాశ్ ఖాతాలో నగదు..! అంతా స్కెచ్ ప్రకారమే..!!

అవినాశ్ ఖాతాలో నగదు..! అంతా స్కెచ్ ప్రకారమే..!!

ఆ సమాచారంతో పక్కా ప్రణాళిక రచించుకున్న ముష్కరులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అవినాశ్‌ బ్యాంకు ఖాతాలో పాకిస్థాన్‌ నుంచి 50 వేల రూపాయల నగదు కూడా జమ అయిందని దర్యాప్తులో తేలింది. భోపాల్‌లోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అవినాశ్‌ తండ్రి కూడా జవానే కావడం గమనార్హం.

 పుల్వామాలో మళ్లీ ఎన్‌కౌంటర్..! ఇద్దరు ఉగ్రవాదుల మృతి..!!

పుల్వామాలో మళ్లీ ఎన్‌కౌంటర్..! ఇద్దరు ఉగ్రవాదుల మృతి..!!

పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా పంజ్ గమ్ అవంతిపురా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాది కూడా ఉన్నారని భద్రత సిబ్బంది చెప్పారు. ఆర్మీ జవాన్లు కాల్పులు కొనసాగిస్తున్నారు.

 రెచ్చిపోతున్న ఉగ్ర మూకలు..! అప్రమత్తమైన భద్రతా బలగాలు..!!

రెచ్చిపోతున్న ఉగ్ర మూకలు..! అప్రమత్తమైన భద్రతా బలగాలు..!!

గురువారం నుంచి భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం పుల్వామాలో గాలింపు చేపట్టారు. గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. పుల్వామా జిల్లాలో దాక్కున్న ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ ఎదురుకాల్పులతో పుల్వామాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
A young man named Avinash Kumar was twenty-five years old as Nayak Clark in Bihar Regiment near Moho town in Indore. In 2018 he was transferred to Assam.In Watsap Pakistani girl was introduced.With the exception of her availability, Avinash was in the throes of the military secrets to her. with the details the terrorists attacked in pulwama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X