వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: మనోళ్ళు మేధావులు, వజ్రాలతో మాస్క్ లు, కరోనాకు బంగారు అంటే భయమా ? ఎవడి పిచ్చి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/సూరత్: ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని పెద్దలు ఓ సామెత చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లాడితో సహ ఎవ్వరిని అడిగినా కరోనా వైరస్ అంటే ఏమిటి ? అనే విషయం చెబుతారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మారుమోగుతున్న పేరు ఒక్కటే. చదుకున్న వారు ఏ మాత్రం చదువుకోని వాళ్ల కూడా కరోనా అంటే అదో పెద్ద మహమ్మారి వైరస్ అని చెబుతున్నారు. కరోనా స్వీట్లు, కరోనా పరోటాలు, కరోనా ఆంమ్లేట్లు పోయి ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి మాస్క్ లు వచ్చాయి.

ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకున్న బంగారు వ్యాపారి ఏకంగా వజ్రాలు, బంగారు తయారు చేసిన మాస్క్ లు తయారు చేసి మార్కెట్ లో పెట్టాడు. వజ్రాలు, బంగారుతో తయారు చేసిన మాస్క్ లు పెట్టుకుంటే కరోనా వైరస్ రాదా ? కరోనాకు బంగారం అంటే భయమా ? అనే ప్రశ్నకు ఆ బంగారు వ్యాపారి దగ్గర సమాధానం ఏమి వచ్చిందో మీరే చూడండి.

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

 పరోటా మాస్క్, ఆంమ్లేట్ లు

పరోటా మాస్క్, ఆంమ్లేట్ లు

కరోనా వైరస్ పేరుతో ఎలాంటి పబ్లిసిటీ లేకుండా వ్యాపారం చెయ్యాలని చాలా మంది అతి తెలివి మేధావులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించినప్పటి నుంచి శానిటైజర్, మాస్క్ లు, పీపీఇ కిట్లు, గ్లోజ్ లు ఇలా చాలా రకాల వ్యాపారాలు పుంజుకున్నాయి. తాజాగా తమిళనాడులోని మదురైలో ఓ మేధావి ఏకంగా పరోటాలతో మాస్క్ లు, కోడిగుడ్లతో కరోనా ఆంమ్లేట్ లు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

 కరోనా స్వీట్లు

కరోనా స్వీట్లు

కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలోనే నెల రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో మరో మేధావి కరోనా స్వీట్లు తయారు చేసి మార్కెట్లో విడుదల చేశాడు. అచ్చం కరోనా వైరస్ వ్యాధి లోగోలు ఎలా ఉంటాయో అలాగే కోల్ కతాలోని ఓ స్వీట్ షాపు యజమాని కరోనా స్వీట్ అని రంగురంగుల్లో తయారు చేసి మొదట ఉచితంగా పంపిణి చేశాడు. తరువాత కరోనా స్వీట్ లు తయారు చేసిన ఆ షాపు యజమాని వ్యాపారం అంతంతమాత్రంగానే ఉండటంతో ఇటీవల ఆ స్వీట్లు తయారు చెయ్యడం నిలిపివేశాడు.

 నవవధూవరులు టార్గెట్

నవవధూవరులు టార్గెట్

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ 5.0 అమలులో ఉన్న సందర్బంగా ఎవరైనా పెళ్లి చెయ్యాలంటే కేవలం 50 మంది మాత్రమే హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం నియమాలు పెట్టింది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటున్న నవవధూవరులను టార్గెట్ చేసుకున్న సూరత్ లోని ఓ బంగారు నగల వ్యాపారి వజ్రాలు, బంగారంతో తయారు చేయించిన ఖరీదైన కొత్త మాస్క్ లు మార్కెట్ లోకి తీసుకు వచ్చారు.

కరోనాకు వజ్రాలు, బంగారం అంటే భయమా ?

కరోనాకు వజ్రాలు, బంగారం అంటే భయమా ?

పెళ్లి చేసుకుంటున్న నవ వధూవరులను టార్గెట్ చేసుకుని వజ్రాలు, బంగారంతో తయారు చేసిన మాస్క్ లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. పెళ్లి చేసుకునే యువతి, యువకుడు కచ్చితంగా మాస్క్ లు వేసుకోవాలి. ఇలా వజ్రాలు, బంగారంతో తయారు చేసిన మాస్క్ లు వేసుకుంటే బాగుంటుందని తయారు చేశామని ఆ షాపు యజమాని అంటున్నారు. వజ్రాలు, బంగారుతో తయారు చేసిన మాస్క్ లు వేసుకుంటే కరోనా రాదా ?, ఆ రెండు పేర్లు వింటే కరోనాకు భయమా ? అని కస్టమర్లు ప్రశ్నిస్తే బంగారు నగల వ్యాపారి నీళ్లు నములుతున్నాడు.

Recommended Video

10 Day Lockdown From July 13-23 పూణేలో 10 రోజుల లాక్ డౌన్, అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు...!!
 మాస్క్ జస్ట్ రూ. 4 లక్షలు అంతే

మాస్క్ జస్ట్ రూ. 4 లక్షలు అంతే

సూరత్ లోని బంగారు నగల షాపులో వజ్రాలు, బంగారంతో తయారు చేసిన మాస్క్ లు రూ. 1. 50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు విక్రయిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా మా వ్యాపారాలు చాలా వరకు దెబ్బతిన్నాయని, ఇలాంటి కొత్త ఆలోచనలతో నగలు తయారు చేయించి వ్యాపారం చేసుకుంటున్నామని సూరత్ లోని బంగారు నగల వ్యాపారులు చెబుతున్నారు.

English summary
Coronavirus Diamond masks: The jeweller in Surat is selling Diamond-studded Masks ranging between Rs. 1.5 lakhs to Rs. 4 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X