• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Gold Smuggling: కారులో దర్జాగా ఎర్రకోటలో వెళ్లిన ‘స్వప్న సుందరి’: సీసీటీవీ కెమెరాలు, నందిని ?

|

చెన్నై/ తిరువనంతపురం: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) పేరు తరువాత గోల్డ్ స్మగ్లింగ్, కేరళ ఐటీ శాఖ, స్వప్న సురేష్ పదాలు హాట్ టాపిక్ అయ్యాయి. కేరళతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో కీలక సూత్రధారి, కింగ్ పిన్ స్వప్న సురేష్ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు గాలిస్తున్నారు. కేరళ నుంచి పారిపోయిన స్వప్న సురేష్ తమిళనాడులో తలదాచుకున్నారని ప్రచారం జరుగుతోంది.

కేరళ నుంచి కారులో స్వప్న సురేష్ తమిళనాడులోకి ప్రవేశించారని వెలుగు చూసింది. స్వప్న సురేష్ ప్రయాణించిన కారు తమిళనాడులోని ఎర్రకోటలోకి వెళ్లినట్లు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని గుర్తించిన అధికారులు ఆమె కోసం వేట మొదలుపెట్టారు. భర్తతో విడాకులు తీసుకుని జల్సాలు చేస్తూ సీఎం, ఆయన వర్గీయులకు సినిమా చూపించి తప్పించుకుని తిరుగుతున్న కిలాడీలేడీ స్వప్న సుందరి కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు.

 వాషింగ్ మిషన్ వెయిట్ అంతే !

వాషింగ్ మిషన్ వెయిట్ అంతే !

తిరువనంతపురం ఎయిర్ పోర్టులో గత సోమవారం కస్టమ్స్ అధికారుల సోదాల్లో రూ. 15 కోట్ల విలువైన 30 కేజీల బంగారం అక్రమంగా తరలించారని వెలుగు చూసింది. ఇంత భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ కావడంతో కస్టమ్స్ అధికారులు బిత్తరపోయారు. ఒక కేజీ, రెండు కేజీలు బంగారు స్మగ్లింగ్ చెయ్యడానికి సాహసం చెయ్యడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యని ఈ రోజుల్లో 30 కేజీల బంగారం స్మగ్లింగ్ చెయ్యడానికి స్కెచ్ వేసిన మేధావి ఎవరు ? అని అధికారులు ఆరా తీశారు.

 సీఎంకు సినిమా

సీఎంకు సినిమా

కేరళలోని యూఏఈ కాన్సులేట్ లో పని చేసి ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ దందా వెనుక కేరళ ప్రభుత్వ ఐటీ విభాగంలో పని చేస్తున్న స్వప్న సురేష్ హస్తం ఉందని ఆ ఉద్యోగి అధికారుల విచారణలో అంగీకరించారు. ఈ దెబ్బతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు ఆయన ప్రభుత్వం ఉలిక్కిపడింది. అయితే ఈ ఘటన వెలుగు చూసిన రోజు కంటే రెండు రోజుల ముందే స్వప్న సురేష్ ను ఆ పదవి నుంచి తప్పించామని కేరళ ప్రభుత్వం చందమామ కథ చెప్పింది.

 అయ్యా.... మోడీ సార్ !

అయ్యా.... మోడీ సార్ !

గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం కేరళ సీఎం పినరయి విజయన్ కార్యాలయం మెడకు చుట్టుకోవడంతో వెంటనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. స్వప్న సురేష్ దెబ్బతో ఉలిక్కిపడిన కేరళ సీఎం పినరయి విజయన్ వెంటనే కేరళ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకరన్ ను ఆ పదవి నుంచి తప్పించారు. అంతే కాకుండా గోల్డ్ స్మగ్లింగ్ కేసును నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కేరళ సీఎం పినరయి విజయన్ స్వయంగా లేఖ రాయడంతో ఆ కేసును ఎన్ఐఏకి అప్పగించారు.

 స్వప్న సుందరి ఎస్కేప్

స్వప్న సుందరి ఎస్కేప్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ అధికారులు స్వప్న సురేష్ కోసం గాలించారు. అప్పటికే దేశవ్యాప్తంగా రచ్చరచ్చ కావడంతో స్వప్న సురేష్ కేరళ నుంచి తప్పించుకున్నారు. కేరళలో మాయం అయిన స్వప్న సురేష్ తమిళనాడు పారిపోయి ఉంటారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తమిళనాడులో మాత్రం స్వప్న సురేష్ ఆచూకి ఇంత వరకు చిక్కలేదు.

ఎర్రకోటలో దర్జాగా వెళ్లిన మేడమ్

ఎర్రకోటలో దర్జాగా వెళ్లిన మేడమ్

కేరళలోని తిరువనంతపురం నుంచి స్వప్న సురేష్ ఎస్ యూవీ కారులో తమిళనాడులోని నెలైల్ జిల్లాలోని ఎర్రకోటలో ఎంట్రీ ఇచ్చిందని అధికారులు గుర్తించారు. స్వప్న సురేష్ ప్రయాణించిన కారు ఎర్రకోటలో వెలుతున్న సమయంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని అధికారులు ఆధారాలు సేకరించారు.

 నందినితో మాట్లాడిన స్వప్న

నందినితో మాట్లాడిన స్వప్న

ఎర్రకోట సమీపంలో స్వప్న సురేష్ వెలుతున్న కారు కొద్దిసేపు నిలబడింది. ఆ సమయంలో నందిని అనే మహిళతో స్వప్న సురేష్ మాట్లాడారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. తనకారులో పిల్లలు ఉన్నారని, దిల్లాంగడికి ఎలా వెళ్లాలో రూట్ చెప్పాలని స్వప్న సురేష్ తనను అడిగారని నందిని అనే మహిళ స్థానిక పోలీసు అధికారులు చెప్పారు. ఇంత దందా చేసి సీఎంతో సహ అందరికీ సినిమా చూపించిన స్వప్న సురేష్ కు రూట్ తెలీదా ? గూగుల్ మ్యాప్ లో రూట్ ఎలా ఉందో అనే సమాచారం తెలుసుకోలేరా ? అని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  Balbir Singh Sr, Triple Olympic Gold Medallist Hockey Legend Passes Away
   శోభన్ ఎక్కడ ?

  శోభన్ ఎక్కడ ?

  గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సంబంధం ఉన్న వారి కోసం ఎన్ఐఏ అధికారులతో పాటు కస్టమ్స్, నేషనల్ ఇంటిలిజెన్స్ అధికారులు గాలిస్తున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న శోభన్ మున్నార్ లో తలదాచుకున్నాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నాగర్ కోవిల్ లో కూడా శోభన్ కోసం అధికారులు గాలిస్తున్నారు. మొదట స్వప్న సురేష్ చిక్కితే ఈ దందాలోని మిగిలిని అందరి భాగోతం బయటపడుతోందని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.

  English summary
  Gold Smuggling Swapna Suresh: The key conspirator in the gold smuggling case Swapna Suresh may be escape to Tamil Nadu, cctv video reveals.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X