వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావ్యాప్తికి తాజా హాట్ స్పాట్స్ అవే .. రైతుల నిరసన కేంద్రాలలో కరోనా డేంజర్ : నిపుణుల హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఢిల్లీ సరిహద్దుల్లోనూ కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో రైతులు నిరసనను చేపట్టి నేటికి ఎనిమిది రోజులు అవుతున్నా, ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా నిరసన ప్రదేశాలలో ఒక్క చోట కూడా కోవిడ్ 19 పరీక్ష శిబిరం ఏర్పాటు చేయకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

బురారీలోని నిరంకారీ గ్రౌండ్స్ లో ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒకే ఒక కోవిడ్ -19 పరీక్షా శిబిరాన్ని కేవలం ఒక్కరోజు మాత్రమే నిర్వహించారు .

కేంద్రంతో రైతుల రెండో విడత చర్చల వేళ: ఢిల్లీ, ఘజియాబాద్ బోర్డర్ లో నిరసన, నేషనల్ హైవే 9 దిగ్బంధం కేంద్రంతో రైతుల రెండో విడత చర్చల వేళ: ఢిల్లీ, ఘజియాబాద్ బోర్డర్ లో నిరసన, నేషనల్ హైవే 9 దిగ్బంధం

రైతుల నిరసన కేంద్రాల వద్ద కరోనా పరీక్షా కేంద్రాలు లేవు

రైతుల నిరసన కేంద్రాల వద్ద కరోనా పరీక్షా కేంద్రాలు లేవు

మరోవైపు, సింఘూ , తిక్రీ మరియు ఘాజిపూర్ సరిహద్దులలోని ఆందోళన శిబిరాల వద్ద మొదటి రోజు నుండి ఇప్పటివరకు ఏ కోవిడ్ -19 పరీక్షా శిబిరాలను గానీ, మెడికల్ వాహనాలను కానీ ఏర్పాటు చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ వేలాదిగా ఆందోళనకారులు తమ ఆందోళన తెలియజేస్తున్నప్పటికీ, అక్కడ వారు ఎవరూ కరోనా నిబంధనలు పాటించక పోవడం పై ఆందోళన వ్యక్తమవుతోంది. వారి వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆందోళన కారులు మాస్కులు ధరించటం లేదు. సామాజిక దూరాన్ని కూడా పాటించటం లేదు . దీంతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంది .

 ఢిల్లీ లో కరోనా సూపర్ స్ప్రెడర్స్ గా రైతులు మారే ఛాన్స్

ఢిల్లీ లో కరోనా సూపర్ స్ప్రెడర్స్ గా రైతులు మారే ఛాన్స్

ఇప్పటికే ఢిల్లీలో విపరీతమైన చలి కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా రైతుల ఆందోళనల కారణంగా కరోనా కేసులు తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వేలాదిగా రైతులు సామాజిక దూర నిబంధనలను పాటించకుండా చేస్తున్న ఆందోళన కారణంగా ఢిల్లీలో కరోనా సూపర్ స్ప్రెడర్ గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీసర్కార్ దీనిపై స్పందించకపోవడం, పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ఢిల్లీ, రైతుల ఆందోళనతో మరింత కరోనాని వ్యాప్తి చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

రైతుల దీక్షా శిబిరాలే .. కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా.. నిపుణుల హెచ్చరిక

రైతుల దీక్షా శిబిరాలే .. కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా.. నిపుణుల హెచ్చరిక


మూడు వ్యవసాయ చట్టాల రద్దు మాట అటుంచి, తాజా పరిణామాలతో కరోనా కంట్రోల్ చేయలేనంతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనావైరస్ వ్యాప్తికి రైతుల నిరసన శిబిరాలు తాజా హాట్ స్పాట్స్ గా మారాయని , ఆ ప్రదేశాలలో పరీక్షా కేంద్రాలు కూడా కనిపించటం లేదని దీంతో కరోనా శరవేగంగా విస్తరించే ప్రమాదం కనిపిస్తుంది. కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైన సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 70 మందికి పైగా వ్యాక్సిన్ తయారీ దారులు క్లినికల్ ట్రయల్స్‌లో ప్రవేశించారు, ప్రస్తుతానికి 3 వ దశ ట్రయల్స్‌లో పలు సంస్థలు పోటీ పడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ ఇంకా రాకపోవటం, దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది .

English summary
The shadow of the pandemic looms large and experts warn their agitation could well be a COVID-19 superspreader but farmers, some in masks and many without them, protesting in Delhi and at gateways into the city say the new farm laws pose a greater threat to their survival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X