• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌కు పెను సవాల్.. స్ట్రాటజీ మార్చిన మిడతలు.. రంగంలోకి డ్రోన్లు,విమానాలు..!!

|

ఓవైపు కరోనా... మరోవైపు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్తతలు.. ఇవి చాలదన్నట్టుగా ఇప్పుడు మిడతల దాడి.. ప్రస్తుతం భారత్‌ను ఈ మూడు సమస్యలు పట్టి పీడుస్తున్నాయి. కరోనాను,చైనాను డీల్ చేసేందుకు మార్గాలున్నాయి. కానీ మిడతల దాడిని ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్దంగా లేదు. అసలే ఆర్థిక మాంద్యం.. ఇప్పుడు వ్యవసాయ రంగం కూడా కుదులైతే భారత్ పునాదులు కదిలిపోతాయి. ఈ నేపథ్యంలో మిడతల దాడిని నివారించడం ఇప్పుడు భారత్ ముందున్న పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది.

యుద్దప్రాతిపదికన మిడతలపై దాడులు..

యుద్దప్రాతిపదికన మిడతలపై దాడులు..

పాకిస్తాన్‌ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన మిడతలు రాజస్తాన్,గుజరాత్,ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్రల్లో పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. మున్ముందు మిడతల దాడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటం.. దక్షిణ భారతంపై కూడా దండెత్తే అవకాశం ఉండటంతో కేంద్రం ఆందోళన చెందుతోంది. యుద్దప్రాతిపదికన 700 ట్రాక్టర్లు,74 ఫైరింజన్లు, మరో 50 ఇతర వాహనాలను రంగంలోకి దించి పంట మిడతలపై క్రిమి సంహారక మందులను జల్లుతోంది. న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మోహపాత్ర తెలిపారు.

నిపుణులు ఏమంటున్నారు..

నిపుణులు ఏమంటున్నారు..

'ఇప్పటివరకైతే మనం వాటిని నియంత్రించగలం. కానీ ఈ మిడతల దండు మరింత పెరిగితే వానకాలం పంటల నాటికి సమస్య జటిలం అవుతుంది.' అని మోహపాత్ర తెలిపారు. క్రిమిసంహారక మందులు జల్లడం ద్వారా సమస్య తీవ్రతను కొంతమేర తగ్గించగలమని చెప్పారు. మిడతల దాడి కారణంగా ఆరు రాష్ట్రాల్లో సుమారు 1,04,000 ఎకరాల్లో పత్తి,తృణ ధాన్యాలు,కూరగాయల పంటలపై ప్రభావం పడిందన్నారు. ముఖ్యంగా రాజస్తాన్‌లో సమస్య మరింత తీవ్రంగా ఉందన్నారు.

స్ట్రాటజీ మార్చిన మిడతలు..

స్ట్రాటజీ మార్చిన మిడతలు..

మిడతల దాడిని ఎదుర్కొనేందుకు డ్రోన్లు,విమానాలను కూడా ఉపయోగించాలనుకుంటున్నామని రాజస్తాన్‌లోని అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీఆర్ కర్వా తెలిపారు. ఈ ఏడాది మిడతలు తమ దాడి వ్యూహాన్ని మార్చాయని.. గతంలో లేనివిధంగా ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నాయని చెప్పారు. సాధారణంగా అయితే అవి తక్కువ ఎత్తులోనే ఎగురుతుంటాయని చెప్పారు. మిడతలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని డీజీసీఏ(డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కైలాష్ చౌదరి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.

ఈసారి ముందే వచ్చేశాయి..

ఈసారి ముందే వచ్చేశాయి..

సాధారణంగా ఉత్తర అమెరికా,మధ్య ప్రాచ్య,దక్షిణ ఆసియా దేశాల్లో కరువు పరిస్థితులు నెలకొని.. ఆ తర్వాత భారీ వర్షాలు కురిస్తే మిడతలు పుట్టుకొస్తాయి. వానా కాలం ప్రారంభంలో పాకిస్తాన్‌ మీదుగా ఇవి భారత్‌లోని ఎడారి ప్రాంతాలకు వచ్చి జూన్-జులై మాసాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 30 కంటే ముందే రాజస్తాన్,పంజాబ్‌లలోకి పింక్ మిడతల సమూహాలు ప్రవేశించాయని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సాధారణంగా రాత్రి వేళల్లో ఇవి చెట్లపై పడుకుని.. పగటి పూట సుదీర్ఘ దూరం ప్రయాణం చేస్తాయని తెలిపింది.

కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి చురకలు..

కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి చురకలు..

మిడతల దాడులపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కాంగ్రెస్‌కు చురకలంటించే వ్యాఖ్యలు చేశారు. 'మా పని మిడతలను తరిమికొట్టడం,లూజర్స్‌ను పట్టించుకోము.' అని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌పై పోరాటం కంటే తమకు కరోనా వైరస్‌,మిడతల దాడులపై పోరాడటం ముఖ్యమని స్పష్టం చేశారు. భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రతీ ఒక్కరూ పోరాటానికి మద్దతు తెలపాల్సిందిపోయి.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం,రాజకీయాలు చేయాలనుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

English summary
Indian authorities are helping farmers mount a pesticide spraying campaign to fight the swarms of desert locusts which have already devastated crops across Pakistan and East Africa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more