వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ ఇంటిలో రూ.4.37 కోట్లు, రెండు కేజీల బంగారం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: క్రికెట్ బెట్టింగ్, అక్రమంగా ఆస్తులు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కోంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కపిల్ మోహన్ కు అరెస్టు భయం పుట్టుకునింది. లోకాయుక్త పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అంటు ఆయన హడలిపోతున్నారు.

క్రికెట్ బెట్టింగ్ దందాలో ప్రమేయం ఉందని, అక్రమంగా ఆస్తులు సంపాధించారని కర్ణాటకకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కపిల్ మోహన్, ఆయన భార్య డాక్టర్ రీచా సక్సేనా మోహన్ ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. లోకాయుక్త పోలీసులు ఇప్పటికే వీరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

యువజన సేవా, క్రీడల శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న కపిల్ సిబాల్, ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖలో పని చేస్తున్న రిచా సక్సేనా మోహన్ లు అక్రమంగా ఆస్తులు సంపాధించారని వీరి మీద దర్యాప్తు చేయించాలని సీఐడి పోలీసులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

 The Lokayukta registered an FIR against senior IAS officer Kapil Mohan

ప్రభుత్వం లోకాయుక్త పోలీసులకు ఈ కేసు అప్పగించింది. గతంలో ఒక సారి లోకాయుక్త పోలీసులు కపిల్ మోహన్ ఇంటిలో సోదాలు చేశారు. ఇప్పుడు ఆయన ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కంపెనీకి చెందిన గోల్డన్ అపార్ట్ మెంట్ లో సోదాలు చేశారు.

సోదాలు చేసిన సమయంలో 4.37 కోట్ల రూపాయల నగదు, 2.5 కేజీల బంగారు నగలు, 37 క్యారెట్ల వజ్రాలు, విలువైన డాక్యూమెంట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. రెండు సార్లు సోదాలు జరగడంతో ఎక్కడ అరెస్టు చేస్తారో అని కపిల్ మోహన్ దంపతులు హడలిపోతున్నారు.

క్రికెట్ బెట్టింగ్ దందాలో అరెస్టు అయ్యి జైలులో ఉన్న హీరాచంద్, అర్జున్ లు నోరు విప్పడంతో కపిల్ మోహన్ అక్రమాలు బయటకు వచ్చాయని లోకాయుక్త పోలీసు అధికారులు చెప్పారు. ఈ క్రికెట్ దందాలో ఇంకా ఎన్ని పేర్లు బయటకు వస్తాయో వేచిచూడాలని లోకాయుక్త అధికారులు అంటున్నారు.

English summary
The Lokayukta police registered an FIR against senior IAS officer Kapil Mohan and his wife Dr Richa Saxena in the disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X