వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాడ్సే ఉగ్రవాది, హిందూ సంఘాలు ఫైర్, హీరో కమల్ హాసన్ మీద కేసు, కోర్టులో జామీను !

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారత మొదటి ఉగ్రవాది హిందూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఊపిరి పీల్చుకున్నారు. కోర్టులో ముందస్తు జామీను కోసం కమల్ హాసన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

తమిళనాడులోని అరవకురిచి ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ నేను ఒక భారతీయుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని అన్నారు. ముస్లీంలు అధిక సంఖ్యలో ఉన్న ఈప్రాంతంలో ఈ మాట చెప్పడంలేదని కమల్ హాసన్ ఆరోజు చెప్పారు.

The Madurai High Court on Monday granted anticipatory bail to actor actor Kamal Haasan.

గాంధీజీ విగ్రహం ముందు నిలబడి ఈమాట చెబుతున్నానని కమల్ హాసన్ అన్నారు. స్వతంత్ర భారత మొదటి ఉగ్రవాది ఒక హిందూ అంటూ ఆ రోజు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని పేరు నాథురామ్ గాడ్స్ అని కమల్ హాసన్ అన్నారు. ఆ రోజు నుంచి భారత్ లో ఉగ్రవాదం మొదలైయ్యిందని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాథూరామ్ గాడ్సేని ఉగ్రవాది అనడంలో మాకు అభ్యంతరంలేదని, హిందూ అనే పదం ఎందుకు ఉపయోగించారు అంటూ కమల్ హాసన్ మీద పలు హిందూ సంఘ సంస్థలు మండిపడ్డాయి. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకడు, హీర్ కమల్ హాసన్ ను అరెస్టు చెయ్యాలని కొన్ని హిందూ సంఘ సంస్థలు డిమాండ్ చేశాయి.

కమల్ హాసన్ మీద కొందరు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అనే ఆందోళనతో కమల్ హాసన్ కోర్టును ఆశ్రయించారు. సోమవారం కమల్ హాసన్ అర్జీని పరిశీలించిన మదురై కోర్టు ఆయనకు ముందస్తు జామీను మంజూరు చేసింది. కమల్ హాసన్ కు జామీను మంజూరు కావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Kamal Haasan got bail. Independent India's first terrorist is a Hindu remark: The Madurai High Court on Monday granted anticipatory bail to actor turned-politician Kamal Haasan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X