వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతనో బార్బర్, విలువైన కార్లున్నాయి, 5 గంటలు సెలూన్ లో ఇలా...

తండ్రి చనిపోయినా కులవృత్తిని చేసుకొంటూ కార్లు అద్దెకిచ్చే వ్యాపారంలోకి దిగి ప్రస్తుతం లగ్జరీ కార్లను అద్దెకిస్తూ ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకొన్నాడు రమేష్ బాబు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:ఆయనో క్షురకుడు. కాని, ఆయన వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇటీవలే జర్మనీ నుండి మేబ్యాచ్ కారును కొనుగోలు చేశాడు. దీని ఖరీదు రూ.3.2 కోట్లు.బెంగుళూరులో ఈ కార్లు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి.ఖరీదైన కార్లను అద్దెకిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. బెంగుళూరుకు చెందిన రమేష్ బాబు అనే క్షురకుడు అంచెలంచెలుగా ఎదిగాడు.

బెంగుళూరుకు చెందిన ఓ క్షురకుడు కార్లను అద్దెకివ్వడం సరదాగా ప్రారంభించాడు.అయితే ఈ సరదా ప్రస్తుతం అతనికి వృత్తిగా మారింది. ఆయన జీవన గమనాన్నే మార్చేసింది.

అత్యంత విలాసవంతమైన కార్లను కూడ కొనుగోలు చేసి వాటిని అద్దెకివ్వడం రమేష్ బాబు చేస్తుంటాడు. అయితే అనేక వ్యయ ప్రయాసాలకు తలొగ్గి ఆయన ఈ రంగంలో నిలదొక్కుకున్నాడు.

ఎవరీ రమేష్ బాబు

ఎవరీ రమేష్ బాబు

బెంగుళూరుకు చెందిన రమేష్ బాబు ఖరీదైన్ కార్లను అద్దెకిస్తుంటాడు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో ఆయన ఓ కంపెనీని ప్రారంభించాడు. రమేష్ బాబు 9వ, తరగతి చదివే సమయంలోనే తండ్రి చనిపోయాడు. పదోతరగతి పూర్తయ్యాక చదువుకు స్వస్తి చెప్పి క్షురకుడిగా కెరీర్ ను ప్రారంభించాడు రమేస్ బాబు. సెలూన్ లో పనిచేస్తూనే 1994 లో ఓ మారుతి వ్యాన్ ను తీసుకొని అద్దెకు ఇవ్వడం ప్రారంభించాడు. ఆనాటి నుండి ఆయన జీవితం మారిపోయింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదగి లగ్జరీ కార్లకు యజమానికిగా మారాడు రమేష్ బాబు

లగ్జరీ కార్లకు యజమాని అయినా సెలూన్ లో పని

లగ్జరీ కార్లకు యజమాని అయినా సెలూన్ లో పని

రమేష్ బాబు టూర్స్ అండ్ ట్రావెల్స్ ను నడుపుతున్నా ప్రతిరోజూ సెలూన్ లో పనిచేయడం మాత్రం మానలేదు. ప్రతి రోజూ సెలూన్ లో ఐదుగంటలపాటు క్షురకుడిగా పనిచేస్తాడు. 30 ఏళ్ళుగా ఆయన దినచర్య మాత్రం మార్చుకోలేదు. ఖరీదైన రోల్స్ రాయల్స్ కారులో తిరిగినా సెలూన్ లో పనిచేయడం మాత్రం మానుకోలేదు.

అన్ని రకాల మోడల్ కార్లు కొనుగోలు చేసిన రమేష్ బాబు

అన్ని రకాల మోడల్ కార్లు కొనుగోలు చేసిన రమేష్ బాబు

రమేష్ బాబు ఓ రోల్స్ రాయ్స్ ,11 మెర్సిడెజ్ ,10 బిఎండబ్ల్యూ, 3 ఆడి,2 జాగ్వార్ కార్లు ఉన్నాయి. ఇటీవలే జర్మనీ నుండి మేబ్యాచ్ కారును రమేష్ బాబు కోనుగోలు చేశాడు. ఈ కారును బెంగుళూరులో ముగ్గురి వద్దే ఉంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, మరో బిల్డర్ వద్ద తర్వాత రమేష్ బాబు వద్దే ఈ కారు ఉంది. హెయిర్ సెలూన్ లో కటింగ్ చేస్తే రూ.75 తీసుకొంటాడు. బార్బర్ గా పనిచేస్తూనే 150 లగ్ఝరీ కార్లకు యజమాని అయ్యాడు రమేష్ బాబు

అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ బాబు

అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ బాబు

1994లో మారుతి వ్యాన్ ను కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం ప్రారంభించాడు. ఆనాటి నుండి ఆయన వెనక్కు తిరిగిచూడలేదు. అంచెలంచెలుగా తన వ్యాపారాన్ని వృద్ది చేసుకొన్నాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్న ట్రావెల్స్ సంస్థలో ధనవంతులున్నారు. 2011 లో రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు రమేష్ బాబు.తాను ఎంత ఎత్తు ఎదిగినా కాని తన మూలాలను మాత్రం మర్చిపోలేదు..మార్కెట్లో ఎన్నిరకాల కార్లున్నాయో అన్ని రకాల కార్లు తన ట్రావెల్స్ ఉండాలనేదే తన కోరికగా ఆయన చెప్పారు.

English summary
They borrowed it from a barber here, who had only recently imported it from Germany. You read that right. We’re talking about the legendary barber Ramesh Babu, who gives haircuts for Rs 75 and collects luxury cars that he rents out too
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X