వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

75 రోజుల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్... ఎన్నికల నిబంధనలు ఎత్తివేసిన ఈసీ

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలైన మార్చి 10నుండి అమల్లోకి వచ్చిన ఎన్నికల నియామాళిని ఎన్నికల కమిషన్ ఎత్తివేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో మే 19 వరకు కొనసాగిన విషయం తెలిసిందే.

The model code of conduct was lifted with immediate effect :EC

లోక్‌సభ ఎన్నికలతో పాటు దేశంలోని నాలుగు రాష్ట్ర్రాల్లో కూడ ఎన్నికలు నిర్వహించారు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్ర్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాగా ఎన్నికలకు సంబంధించి మే 23న ఫలితాలు వెలువడ్డాయి. మే 30న నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం కూడ కొలువుదీర నుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ కూడ పూర్తయిందని, ఈనేపథ్యంలోనే వెంటనే ఎన్నికల నియమావళిని ఎత్తివేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఎన్నికల నియామళి నేపథ్యంలో ప్రభుత్వ యత్రాంగం మొత్తం ఈసీ చెతుల్లోకి వెళుతుంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు,నాయకులు ఎలాంటీ ప్రజా ఉపయోగమైన నిర్ణయాలు తీసుకోకుండా నిశితంగా పరీశిలిస్తారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన నాయకులకు నోటీసులు ఇవ్వడంతోపాటు, ఆయా పార్టీలకు మద్దతు పలికిన అధికారులను సైతం సస్పెండ్ చేసింది. కాగా గతంలో ఎప్పుడు లేనట్టుగా ఏపి సీఎస్‌ను
మార్చి కొత్త సీఎస్ ఎల్వీ సుభ్రమణ్యం ను హుటాహుటిన రంగంలోకి దింపింది ఈసీ.

English summary
The model code of conduct, which came into force on March 10 when the Lok Sabha election was announced, was lifted with immediate effect, the Election Commission said on Sunday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X