స్కూల్ లో హిందూ అమ్మాయిలకు బలవంతంగా హిజాబ్ లు, సీఎం సీరియస్, విచారణ !
భోపాల్/మధ్యప్రదేశ్: ముస్లీం అమ్మాయిలు స్కూల్ కు, కాలేజ్ కు వెళ్లే సమయంలో హిజాబ్ లు (బుర్కాలు) వేసుకుంటారు. ఇటీవల ఓ స్కూల్ లో బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సంపాధించిన టాపర్ల ఫోటోలను స్కూల్ యాజమాన్యం విడుదల చేసింది. అందులో హిందువులు అయిన అమ్మాయిలకు బలవంతంగా హిజాబ్ లు వేసి ఫోటోలు విడుదల చేశారని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ విషయంలో సీరియర్ అయిన ముఖ్యమంత్రి, హోమ్ శాఖా మంత్రి విచారణకు ఆదేశించారు. మధ్యప్రదేశ్ లోిన దామోహ్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆ స్కూల్ లో చదువుతూ బోర్డు పరిక్షల్లో మంచి మార్కులు సాధించిన అమ్మాయిల ఫోటోలు విడుదల చేశారు. ఆ ఫోటోల్లో ముస్లీం అమ్మాయిలతో పాటు హిందూ అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.

హిందువులు అయిన అమ్మాయిలతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం బలవంతంగా హిజాబ్ లు వేయించి ఫోటోలు తీశారని ఆరోపిసూ దామోహ్ జిల్లాలో వీహెచ్ పీ, ఏబీవీపీ నాయకులు, హిందూ సంఘ, సంస్థ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చైర్మన్ ప్రియాంక్ కనూంగ్ దామోహ్ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.
ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న హిందూ అమ్మాయిల కుటుంబ సభ్యుల దగ్గరకు విద్యాశాఖ అధికారులు వెళ్లి విచారణ చేశారని, అయితే అమ్మాయిల కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని దామోహ్ జిల్లా కలెక్టర్ అంటున్నారు. స్కూల్ యూనీఫామ్ లో భాగంగా అమ్మాయిల స్కార్ప్ లు ధరించారని, బలవంతంగా హిజాబ్ లు వేసుకోవాలని మేము అమ్మాయిలకు చెప్పలేదని స్కూల్ యాజమాన్యం అంటోంది.
అమ్మాయిలు స్కార్ప్ లు చేతినిండా కప్పుకోవడంతో కొందరు వాటిని హిజాబ్ లు అని ఆరోపిస్తున్నారని గంగా జమునా హయ్యర్ సెకండరీ స్కూల్ ముస్తాక్ అహమ్మద్ అంటున్నారు. అయితే ఈ వివాదంపై తాము విచారణకు ఆదేశించామని, ఎవరైనా హిందూ అమ్మాయిలతో బలవంతంగా హిజాబ్ లు వేయించారని వెలుగు చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ హోమ్ శాఖా మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియాకు చెప్పారు.
అమ్మాయిల కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యకపోయినా ఆ ఫోటోల ఆధారంగా లోతుగా విచారణ చెయ్యాలని దామోహ్ జిల్లా పోలీసు కమీషనర్ కు సూమించామని హోమ్ శాఖా మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. హిజాబ్ వివాదం విషయంలో విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తరువాత తాను మాట్లాడుతానని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications