వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. శ్రీలంక బాంబు పేలుళ్ల సంబంధాలపై విచారణ

|
Google Oneindia TeluguNews

తమిళనాడులో ఐసీస్‌కు సపోర్ట్ చేస్తున్నారన్న సమాచారంతో తమిళనాడు రాష్ట్ర్ర్రంలోని పదిచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా ఈసోదాలు ఏకకాలంలో పదిమంది ఐఎస్ సానూభూతి పరుల ఇళ్లలో జరిగాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర జరుగుతుందన్న సమాచారంతోనే ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

The National Investigations Agency carried out raids in Tamil Nadu

కాగా తమిళనాడులోని ముత్తుపేట్, కిలాకరాయి, దేవీపట్టినం, లాల్‌పేట్,తోపాటు చిదంబరం ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో ల్యాప్‌ట్యాప్‌లు, హర్డ్‌డిస్క్‌లతోపాటు పెన్‌డ్రైవ్ ఇతర సాంకేతిక పరికారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడ వీరిపై 2018లోనే ఆయుధాలు, ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నారన్న కేసు నమోదు చేసీ కోర్టులో హజరుపరిచారు. అయితే మొత్తం పదిమంది గ్రూపులో తోమ్మిది మందిని అరెస్ట్ చేశామని మిగతా ఒక్కరు తప్పించుకున్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

తోమ్మిది మందికి బెయిల్ లభించడంతో వారు విడుదల అయ్యారని పోలీసులు తెలిపారు. కాగా బెయిల్ నుండి విడుదలైన వారు తిరిగి ఐఎస్ సానుభూతిపరులుగా ఉన్న అనుమానంతోనే దాడులు చేసినట్టు వారు తెలిపారు.ఇక వారు ఓ వాట్పస్ గ్రూప్‌ను కూడ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.మరోవైపు శ్రీలంకలో జరిగిన ఈస్టర్ ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలకు సంబంధించి ఏమైన లింకు ఉందా కోణంలో
పోలీసులు సోదాలు జరిపినట్టు తెలుస్తోంది,

English summary
The National Investigations Agency (NIA) on Monday carried out raids at 10 places in Tamil Nadu in connection with a case filed against eight people for allegedly supporting Islamic State (IS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X