వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ ఆకాంక్ష నెరవేర్చడంలో విద్యావిధానం ముఖ్య సాధనం, ప్రాక్టికల్‌కే ప్రాధాన్యం: మోడీ

|
Google Oneindia TeluguNews

జాతీయ విద్యావిధానంలో అధ్యయనం చేయడం కాకుండా నేర్చుకోవడంపై ఫోకస్ చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. విమర్శనాత్మక ఆలోచనలపై ఫోకస్ చేయడం ద్వారా.. విద్యార్థులు క్రియేటివిటీ పెరుగుతుందన్నారు. గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ప్రధాని మోడీ జాతీయ విద్యా విధానం 2020పై వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. జాతీయ విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేశామని మోడీ పేర్కొన్నారు.

Recommended Video

New National Education Policy 2020: 5+3+3+4 System, New Exams Pattern || Oneindia Telugu

టెక్నికల్, వొకేషనల్..


సమాచారం, విజ్ఞానం మరింత సరళతరం అయ్యిందని మోడీ అన్నారు. ప్రస్తుతం కొన్ని వీడియోల ద్వారా సమాచారం ఎంత వేగంగా వెళుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందనే విషయాన్ని పేర్కొన్నారు. టెక్నికల్, వొకేషనల్ అన్ని విద్యా విధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చామని మోడీ తెలిపారు. జాతీయ విద్యా విధానం కోసం 2 లక్షల మంది నుంచి అభిప్రాయం తీసుకున్నామన్నారు. విధానం రూపొందించడానికి 5 ఏళ్ల సమయం పట్టిందని చెప్పారు.

దేశ ఆకాంక్ష నెరవేర్చడంలో కీ రోల్

దేశ ఆకాంక్ష నెరవేర్చడం కోసం విద్యా విధానం ముఖ్య సాధనం అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు విద్యా విధానంలో ఇక కలుగజేసుకోబోవు అని తేల్చిచెప్పారు. ఇదివరకు జోక్యం చేసుకోవడం వల్లే ఇబ్బందులు వచ్చాయని పరోక్షంగా చెప్పారు. దీంతో విద్యార్థులతోపాటు, పేరంట్స్, టీచర్స్‌కు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. విద్యా ప్రమాణాలు పెరగడంతో.. అంతర్జాతీయ యవనికపై భారత్ సత్తా చాటుతోందని మోడీ అభిప్రాయపడ్డారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కూడా దీంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.

జ్ఞానం, నైపుణ్యం డెవలప్..

ఓ గ్రామంలో టీచర్ లేదా విద్యా వేత్తలు కూడా జాతీయ విద్యావిధానంపై దృష్టిసారిస్తున్నారని మోడీ తెలిపారు. గత విద్యా విధానం నుంచి అభివృద్ది చూడాలని అభిలషిస్తున్నారని చెప్పారు. యువతలో జ్ఞానం, నైపుణ్యం మరింత పెంపొందించేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. 1986లో జాతీయ విద్యావిధానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 34 ఏళ్ల తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులను ప్రవేశపెడుతూ.. మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది.

English summary
President Ram Nath Kovind and Prime Minister Narendra Modi addressed the inaugural session of the Governors’ Conference on National Education Policy through video conference today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X