శ్రీలంక వరుస బాంబు పేలుళ్లు, తమిళనాడులో ఐఎన్ఏ సోదాలు, సోషల్ మీడియాలో ఉగ్రవాదులు !
చెన్నై: ఈస్తర్ పండుగ సందర్బంగా శ్రీలంక రాజధాని శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. శ్రీలంకలో జరిన ఆత్మాహుతి దాడుల్లో వందలాది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో
కలిసిపోయాయి. శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఉగ్రవాదులతో తమిళనాడుకు సంబందం ఉందని వెలుగు చూసింది.
ఈస్టర్ పండుగ సందర్బంగా శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నిందితుల కోసం పోలీసులు ఇప్పటి వరకూ గాలిస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల నిందితులు తలదాచుకున్నారని సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు.
బుధవారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ కోయంబత్తూరులోని వివిద ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐసీఎస్ ఉగ్రవాదులతో సోషల్ మీడియాలో సంబంధాలు పెట్టుకున్న నిందితులు కోయంబత్తూరులో తలదాచుకున్నారని ఐఎన్ఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

శ్రీలంక ఆత్మాహుతి దాడులకు సంబంధించిన నిందితులు కోయంబత్తూరులో తల దాచుకున్నారని సమాచారం అందడం వలనే ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారని సమాచారం. ఐసీఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నారని వెలుగు చూడటంతో కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్న వస్తువులు, పత్రాల వివరాలు రహస్యంగా పెట్టారు. ఈస్టర్ పండుగ సందర్బంగా శ్రీలంకలో 9 ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు జరిగాయి తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్ఐఏ అధికారులు ఇంకా సోదాలు చేస్తున్నారు. శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు తామే కారణం అని ఐసీఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు.