వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఐఎంను పక్కనపెట్టిన బీహార్ ముస్లిం ఓటర్లు! ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి గెలుపు కోసమేనా?

|
Google Oneindia TeluguNews

పాట్నా/హైదరాబాద్: తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ అంతగా తన ప్రభావాన్ని చూపలేదు. 2019 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగ్గా రాణించిన ఈ పార్టీ.. తాజాగా ఎన్నికల్లో మాత్రం తడబడింది.

ఆల్ ఇండియా ముజ్లిస్ ఈ ఇత్తేహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) గత ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలో ఆరు స్థానాల్లో పోటీ చేయగా ఒక స్థానంలో గెలిచింది. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ మిగితా ఆ ఐదు స్థానాల్లో ఎంఐఎంకు డిపాజిట్లు కూడా రాకపోవడం గమనార్హం. కొచ్చాదమన్ నియోజకవర్గంలో రెండోస్థానంలో నిలిచిన ఈ పార్టీ అభ్యర్థికి 26.14 శాతం ఓట్లు రావడం గమనార్హం.

2019లో మొదట, ముస్లిం ఆధిపత్యంలో ఉన్న కిషన్‌గంజ్ నియోజకవర్గంలో పోరాడిన ఏకైక లోక్‌సభ పోల్‌లో ఈ పార్టీ మంచి ప్రదర్శన ఇచ్చింది. పార్టీ సీటు గెలవలేక పోయినప్పటికీ, అది పోరాటాన్ని త్రిముఖ పోటీ చేసింది. ఈ స్థానాన్ని కాంగ్రెస్ 33.32% ఓట్లతో గెలుచుకుంది. జేడీయూ 30.19% ఓట్లతో రన్నరప్‌గా, ఎఐఎంఐఎం 26.78% ఓట్లతో మూడో స్థానంలో ఉంది.

 The Non-choice for Muslim Voters: Why Owaisis AIMIM May Fail Yet Again in Bihar

ఏఐఎంఐఎం బహదూర్‌గంజ్, కొచ్చాదమన్ అసెంబ్లీ విభాగాలలో నాయకత్వం వహించగా, అమోర్ అసెంబ్లీ విభాగంలో రెండవ స్థానంలో ఉంది. ఇతర అసెంబ్లీ విభాగాలలో పార్టీ మూడవ స్థానంలో ఉంది. అవి కిషన్‌గంజ్, ఠాకుర్‌గంజ్, బైసీ. ఆపై ఎంఐఎం అక్టోబర్ 2019లో కిషన్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలిచింది. ఏఐఎంఐఎం కమ్రుల్ హోడా ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.

అయితే, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ వెనకబడింది. సీఏఏ, ఎన్నార్సీలను విస్తృతంగా ప్రచారంలో వాడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 20 స్థానాల్లో పోటీ చేసి ఆర్‌ఎల్‌ఎస్‌పి, బిఎస్‌పిలతో పొత్తు పెట్టుకున్నా ఎన్నికల్లో రాణించలేదు. అయితే, ముస్లిం ఓటర్లు బీహార్‌లో జెడి(యు)-బిజెపిని అధికారానికి దూరంగా ఉంచడానికి ఒవైసీ కంటే ఆర్జెడి-కాంగ్రెస్ మహాగత్బంధన్‌ను ఇష్టపడినట్లు తెలుస్తోంది.

ఓవైసీ పార్టీ గత సంవత్సరం కిషన్‌గంజ్‌లో కొన్ని ముఖ్యమైన ఓట్లను సంపాదించి ఉండవచ్చు, కానీ, ఈ స్థానంలో గెలవలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ రాష్ట్రంలో సర్కారు ఏర్పాటు చేయలేదు కాబట్టి ముస్లిం ఓటర్లు ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమివైపు మొగ్గుచూపినట్లు స్పస్టమైంది. .

కిషన్‌గంజ్ ఉపఎన్నికల్లో 10వేల ఓట్లతో ఎంఐఎం గెలిచింది. రెండో స్థానంలో బీజేపీ ఉంది. ఈ క్రమంలో ఓట్లు చీలిపోకుండా మహాకూటమి అభ్యర్థికే ముస్లింలు ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఎంఐఎంకు ముస్లింలో ఓటు వేస్తే ఓట్లు చీలిపోయి ఎన్డీఏకు లాభం జరిగే అవకాశం ఉందని తలచిన ఓటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం ఓటర్లు ఇదే విధానాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది.

English summary
Despite showing an impressive performance in the 2019 Lok Sabha elections and winning an assembly constituency in October 2019, Asaduddin Owaisi may fail yet again in Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X