బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Jewelery: మా బంగారం, జ్యువెలరీ షోరూమ్ ఓనర్లకు సినిమా చూపించిన ఐటీ శాఖ, అర్దరాత్రి సెకండ్ షో !

చాలా కాలంగా ఐటీ హబ్ లోని జ్యువెలరీ షోరూమ్ ల మీద కన్ను వేసిన ఐటీ శాఖ అధికారులు ఒకేసారి పలు ప్రాంతాల్లోని జ్యువెలరీ షోరూమ్ ల్లో దాడులు చేశారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో బంగారం వ్యాపారం ప్రతినిత్యం వందలు, వేల కోట్ల రూపాయాల్లో జరుగుతుంది. ఇక వివాహాలు ఎక్కువ జరిగే సందర్బాల్లో బెంగళూరులోని జ్యువెలరీ షోరూమ్ లు కిటకిటలాడుతుంటాయి. చిన్నచిన్న బంగారు నగల షాపులతో పాటు ఐటీ హబ్ లో కోట్లలో లావాదేవీలు జరిగే జ్యువెలరీ షోరూమ్ లు ఉన్నాయి. చాలా కాలంగా ఐటీ హబ్ లోని జ్యువెలరీ షోరూమ్ ల మీద కన్ను వేసిన ఐటీ శాఖ అధికారులు ఒకేసారి పలు ప్రాంతాల్లోని జ్యువెలరీ షోరూమ్ ల్లో దాడులు చేశారు. జ్యువెలరీ షోరూమ్ యజమానులకు ఐటీ శాఖ అధికారులు అర్దరాత్రి వరకు సెకండ్ షో సినిమా చూపించడం హాట్ టాపిక్ అయ్యింది.

magician: భార్యకు ఆరోగ్యం బాగాలేదని మాంత్రికుడి దగ్గరకు వెళ్లాడు, ఆంటీని వదిలేసి వాడు ఏం చేశాడు ?magician: భార్యకు ఆరోగ్యం బాగాలేదని మాంత్రికుడి దగ్గరకు వెళ్లాడు, ఆంటీని వదిలేసి వాడు ఏం చేశాడు ?

పన్ను ఎగవేశారని ఫుల్ డౌట్

పన్ను ఎగవేశారని ఫుల్ డౌట్

బెంగళూరు నగరంలోని పలు జ్యువెలరీ షోరూమ్ లు నిర్వహిస్తున్నా వ్యాపారులు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఐటీ హబ్ లోని నగల దుకాణాలు, వాటి యజమానుల ఇళ్లపై దాడులు చేసి అనేక విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ శాఖ అధికారులు సోదాలు పూర్తి అయ్యే వరకు మీడియాకు మ్యాటర్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అర్దరాత్రి వరకు సోదాలు.... సెకండ్ షో సినిమా

అర్దరాత్రి వరకు సోదాలు.... సెకండ్ షో సినిమా

మంగళవారం ఉదయం జ్యువెలరీ షోరూమ్ లు ఓపెన్ అయిన వెంటనే సోదాలు మొదలు పెట్టిన ఐటీ శాఖ అధికారులు అర్థరాత్రి వరకు సోదాలు చేశారు. బెంగళూరు నగరంలోని 25కి పైగా జ్యువెలరీ షోరూమ్ ల్లో, ఆ నగల దుకాణాల యజమానుల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు ఒకేసారి సోదాలు చేశారు. విచారణలో పన్ను ఎగవేతకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

బెంగళూరులో టార్గెట్ చేసిన షోరూమ్ లు

బెంగళూరులో టార్గెట్ చేసిన షోరూమ్ లు

బెంగళూరు నగరంలోని జయనగర్, శంకర్‌పుర, బసవనగుడి, యశవంత్‌పుర్‌, చిక్కపేటతోపాటు పలు ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారని బుధవారం కన్నడ మీడియా తెలిపింది. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే సమాచారం మేరకు ఐటీ శాఖ అధికారులు జ్యువెలరీ షోరూమ్ ల్లో సోదాలు చేపట్టారని తెలిసింది.

పత్రాలు మొత్తం ఇవ్వండి

పత్రాలు మొత్తం ఇవ్వండి

బంగారు నగలు కొనుగోలు, విక్రయాలు, ఆ నగలకు సంబంధించి ధృవీకరణ సమయంలో పన్ను చెల్లింపులో వ్యత్యాసం కనుగొనబడింది. అలాగే ప్రతినిత్యం వ్యాపారంలో నిర్వహించిన ఆర్థిక లావాదేవీల్లోనూ తేడా కనిపించింది. ఈ నేపథ్యంలో బంగారు నగల వ్యాపారుల నుంచి అవసరమైన సమాచారాన్ని ఐటీ శాఖ అధికారులు రాబట్టారని తెలిసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని పత్రాలను కూడా అందించాలని ఐటీ శాఖ అధికారులు జ్యువెలరీ షోరూమ్ ల యజమానులను ఆదేశించినట్లు సమాచారం.

English summary
The officials of the IT department, who showed the film to the owners of jewelery showrooms, said that 25 places were searched simultaneously in Bengaluru and tax was evaded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X