• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహా కథలోనూ మూలాలు మహిళలే ... మహా రాజకీయ చదరంగంలో ఆ ముగ్గురు మహిళలు

|

మహారాష్ట్ర రాజకీయంలో ఇన్ని నాటకీయ పరిణామాలకు కారణం ఎవరు? ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి నేటి వరకు ఊహించని విధంగా మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం చివరికి ఇక్కడికి రావడం వెనుక ఉన్న వారు ఎవరు? హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మించిన రాజకీయంతో సాగుతున్న మహా ట్విస్టులలో మహిళల పాత్ర ఉందని జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఆ మహిళలు ఎవరు ? అన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ప్రధాన చర్చ.

మహా అసెంబ్లీ సమావేశం: ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేడే: 28 సాయంత్రం 6.40 కి సీఎంగా ఉద్దవ్ ప్రమాణం

 మహా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ముగ్గురు మహిళలు

మహా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ముగ్గురు మహిళలు

మహారాష్ట్ర రాజకీయం ఎన్నికలు ముగిసిన నాటి నుండి నేటి వరకు ఊహించని ట్విస్ట్ లతో ముందుకు సాగింది. ఇక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏర్పడిన బిజెపి, శివసేన చీలిక వర్గంతో ఏర్పాటైన ప్రభుత్వం పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయింది. ప్రభుత్వ ఏర్పాటు చేయకుండానే సర్కారు కుప్పకూలింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పదవులకు రాజీనామా చేశారు. దీంతో శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకు సీఎం పీఠం అధిరోహించనున్నారు. సంచలన ఈ పరిణామాల్లో ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషించినట్లు ఆసక్తికర చర్చ జరుగుతుంది.

 కుమారుడిని రంగంలో దించి ఉద్ధవ్ 50: 50 ఫార్ములా కోరటం వెనుక రీజన్ భార్య రష్మీ ఠాక్రే

కుమారుడిని రంగంలో దించి ఉద్ధవ్ 50: 50 ఫార్ములా కోరటం వెనుక రీజన్ భార్య రష్మీ ఠాక్రే

ఇక అసలు విషయానికి వస్తే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీలో దిగారు. ఇక ఆదిత్య ఠాక్రే పోటీ వెనుక ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే ఉన్నట్లుగా తెలుస్తుంది. బీజేపీకి తోకపార్టీలా ఉండటం కంటే ఎన్నికల రణరంగంలో తేల్చుకోవడం అనే ఎజెండాతో ఆయన్ను ఉద్దవ్ సతీమణి పోటీకి దించారని ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ఫలితాల తరువాత కూడా చెరో రెండున్నరేళ్లు పదవీ కాలాన్ని పంచుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే కు గట్టిగా చెప్పింది కూడా ఆయన సతీమణి అని శివసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అజిత్ నిర్ణయంతో శరద్ పవార్ పై అనుమానాలు

అజిత్ నిర్ణయంతో శరద్ పవార్ పై అనుమానాలు

వ్యక్తమవుతున్న వేళ రంగంలోకి దిగిన సుప్రియ సూలె

ఇక ఈ షరతు నచ్చక శివసేన తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చేతులెత్తేసి, ఆ తర్వాత ఏదో చేయాలనుకుని, ఇంకేదో చేసి అభాసుపాలైంది బిజెపి. మహా రాజకీయంలో కీలక భూమిక పోషించిన మరో ముఖ్య మైన మైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే. అజిత్ అందరికి షాక్ ఇస్తూ బీజేపీకి మద్దతివ్వడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో శరద్ పవార్ కు తెలీకుండా ఇదంతా జరగదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదంతా శరత్ పవార్ ఆడుతున్న ఆట అని చర్చించుకున్న తరుణంలో రంగంలోకి దిగిన సుప్రియ సూలే తన వాట్సాప్ స్టేటస్ ల ద్వారానే ఎన్సీపీ నే కాదు కుటుంబం కూడా రెండుగా చీలిపోయింది అని ప్రకటన చేశారు.

 సుప్రియా సూలె వాట్స్ యాప్ స్టేటస్ లే శరద్ పై అనుమానాల నివృత్తికి పనికొచ్చాయని టాక్

సుప్రియా సూలె వాట్స్ యాప్ స్టేటస్ లే శరద్ పై అనుమానాల నివృత్తికి పనికొచ్చాయని టాక్

అప్పటికిగానీ మిగతా పార్టీలకు అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయంలో శరద్ పవార్ కు ఎలాంటి ప్రమేయం లేదు అన్నది బోధపడలేదు. సుప్రియ సూలే తన తండ్రి పై వస్తున్న అపవాదులు తొలగించడానికి చేసిన ప్రయత్నం పై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. 'గుడ్ మార్నింగ్. ఎప్పటికైనా విలువలే గెలుస్తాయి. నిజాయితీ కష్టం వృధాగా పోవు. నిజాయితీతో పనిచేయడం కొంచెం కష్టమైనా..దాని ఫలితాలు ఎక్కువ కాలం ఉంటాయని' అప్డేట్ పెట్టారు. 'అధికారం వస్తుంటుంది..పోతుంటుందని నేను నమ్ముతా. కానీ వాటికన్నా బంధాలు చాలా ముఖ్యమైనవి' అని ఎమోషనల్ టచ్ ఇచ్చారు. సోదరుడు అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయంపై ప్రభావం పడేలా, ఆలోచించేలా ఆమె వ్యాఖ్యలు చేశారు.

అజిత్ పవార్ ను తిరిగి పార్టీలోకి , కుటుంబంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్ సతీమణి ప్రతిభ

అజిత్ పవార్ ను తిరిగి పార్టీలోకి , కుటుంబంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్ సతీమణి ప్రతిభ

ఇక మరో మహిళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సతీమణి ప్రతిభ. ఎవరూ ఊహించని విధంగా ఎన్సీపీకి షాకిచ్చి బీజేపీకి మద్దతిచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి పొంది బీజేపీతో కలిసి సర్కారు ఏర్పాటు చేస్తానని చెప్పిన అజిత్ పవార్ ను తిరిగి ఎన్సీపీ లోకి తీసుకురావడం కీలక పాత్ర పోషించిన మహిళ శరత్ పవార్ సతీమణి ప్రతిభ. అజిత్ పవార్ పిన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సతీమణి ప్రతిభ మహారాష్ట్ర రాజకీయాలలో అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయంతో తన భర్త శరత్ పవార్ పడుతున్న ఇబ్బంది ని చూసి కొడుకైన అజిత్ వద్దకు వెళ్లి చర్చలు జరిపారు.

పార్టీ నుండి సస్పెండ్ చెయ్యలేదు కాబట్టి తిరిగి రావాలని కోరిన అజిత్ పిన్ని ప్రతిభ

పార్టీ నుండి సస్పెండ్ చెయ్యలేదు కాబట్టి తిరిగి రావాలని కోరిన అజిత్ పిన్ని ప్రతిభ

పార్టీ ఫ్లోర్ లీడర్ గా తొలగించినంత మాత్రాన దూరం పెట్టినట్లు కాదని ఇప్పటివరకూ పార్టీ నుంచి సస్పెండ్ చేయనందున తిరిగి రావాలని కోరారు. బీజేపీతో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటే పార్టీలో కలిసి పనిచేసుకోవచ్చునని సూచించారని సమాచారం. దీంతో అజిత్ వెనక్కు తగ్గడంలో ప్రతిభ పాత్ర ఉంది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దీంతో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి అజిత్ పవార్ ఎన్సీపీ బాటపట్టారు.

మహా రాజకీయాలను మలుపు తిప్పిన మహిళలుగా వీరిపై దేశం దృష్టి

మహా రాజకీయాలను మలుపు తిప్పిన మహిళలుగా వీరిపై దేశం దృష్టి

మొత్తానికి ఈ ముగ్గురు మహిళలు నడిపిన రసవత్తర రాజకీయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే , ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సతీమణి ప్రతిభ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె క్రియాశీలకంగా వ్యవహరించారని చర్చ జరుగుతుంది. మహా రాష్ట్ర రాజకీయాలను మలుపులు తిప్పటంలో వీరి పాత్ర ఎవరూ కాదనలేనిది. అందుకే అంటారు ఒక మహారాష్ట్ర కథనే కాదు . ఏ కథకైనా ఆడదే ఆధారం మనకథ ఆడనే ఆరంభం అని...

English summary
Three women have played a key role in the politics of Maharashtra. Uddhav Thackeray wife Rashmi Thackeray, NCP chief Sarath Pawar wife Pratibha and daughter Supriya Sule have been instrumental in turning Maha politics. There is a major debate on these three women across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X