వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంగా పళనిసామి కొనసాగింపు: పన్నీర్ చేతిలో రిమోట్: తిరుగుబాటు ఎమ్మెల్యేలు!

తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిసామిని కొనసాగించాలని నిర్ణయించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే విలీన చర్చల అంశాల్ని రహస్యంగా ఉంచేందుకు పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు నిర్ణయించాయి. ఈ విషయంలో కమిటీలకు నేతృత్వం వహించే నాయకులు తప్ప ఇతరులు ఎవ్వరూ నోరు మెదపకూడదని తమ శిబిరాల్లోని నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.

<strong>తమిళ తారలను వేధించిన దినకరన్, జనార్దన్, అందుకే నమిత, ఇంధ్ర హీరోయిన్!</strong>తమిళ తారలను వేధించిన దినకరన్, జనార్దన్, అందుకే నమిత, ఇంధ్ర హీరోయిన్!

పన్నీర్, పళనిసామి వర్గీయులు రహస్యంగా మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. రెండో రోజు ఇరు వర్గాలు రహస్యంగా మంతనాలు జరిపారు. ఈ సందర్బంగా ఎవ్వరు పడితే వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో విలీన చర్చలకు బ్రేక్ పడుతుందని, ఇక మీద అలా జరగడానికి వీళ్లేదని ఇరు వర్గాలు నిర్ణయించాయి. మనం మనమే గొడవలు చేసుకుంటుంటే మరోకరికి చాన్స్ ఇచ్చే అవకాశం వస్తోందని, అలా జరగడానికి వీళ్లేదని పన్నీర్, పళనిసామి వర్గాలు నిర్ణయించాయి.

మాట్లాడేది వీరు మాత్రమే

మాట్లాడేది వీరు మాత్రమే

పన్నీర్ సెల్వం వర్గం నుంచి మాజీ మంత్రులు కేపీ మునిసామి, నత్తం విశ్వనాథన్, సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గం నుంచి ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ రహస్య మంతనాలు జరిపారు. ఇరు వర్గాల డిమాండ్ల మీద చర్చించారు.

స్టార్ హోటల్ లోనే రాత్రి మంతనాలు

స్టార్ హోటల్ లోనే రాత్రి మంతనాలు

చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో రెండో రోజు రహస్య మంతనాలు జరిపిన ఈ నాయకులు ఇక మీద ఎవ్వరు పడితే వారు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లడరాదని ఇరు వర్గాల్లోని నాయకులకు ఆదేశాలు జారీ చెయ్యాలని నిర్ణయించారు.

సీఎంగా పళనిసామి, పన్నీర్ చేతికి రిమోట్

సీఎంగా పళనిసామి, పన్నీర్ చేతికి రిమోట్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిసామిని కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ప్రభ్వుత్వానికి నడిపించడానికి ఓ కమిటీని ఏర్పాటు చెయ్యాలని, ఆ కమిటీకి పన్నీర్ సెల్వం అధ్యక్షుడిగా ఉంటారని, ఆయన నేతృత్వంలోనే ప్రభుత్వం నడిచేలా చెయ్యాలని నిర్ణయించారు.

3+4 ఫార్ములాతో ముందుకు

3+4 ఫార్ములాతో ముందుకు

ప్రభుత్వాన్ని నడిపించే కమిటీ రిమోట్ పన్నీర్ సెల్వం చేతిలో ఉండాలని, ఆ కమిటీలో ఏడుగురు సభ్యులను నియమించాలని నిర్ణయించారని తెలిసింది. పన్నీర్ సెల్వం శిభిరం నుంచి నలుగురు, పళనిసామి వర్గం నుంచి ముగ్గురిని కమిటీ సభ్యులుగా నియమిస్తారని సమాచారం.

ఆ విషయంలో ఆలస్యం

ఆ విషయంలో ఆలస్యం

కొత్తగా మంత్రి పదువులను ఆశిస్తున్న వారిలో ఏడు మంది సభ్యులుగా ఎంపిక చేసి పన్నీర్ సెల్వం కమిటీ సభ్యులను చెయ్యాలని, ఇప్పుడే పదవుల పందేరం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, లేదంటే ప్రజల్లో చెడ్డపేరువస్తుందని ఇరు వర్గాల నాయకులు నిర్ణయించారని సమాచారం.

తగ్గేదిలేదంటున్న 28 మంది ఎమ్మెల్యేలు

తగ్గేదిలేదంటున్న 28 మంది ఎమ్మెల్యేలు

పన్నీర్, పళనిసామి వర్గానికి పోటీగా తయారైన 28 మంది ఎమ్మెల్యేలు మా డిమాండ్లు తీర్చిన తరువాత మా నిర్ణయం ప్రకటిస్తామని తేల్చి చెబుతున్నారు. గురువారం అర్దరాత్రి వరకు ఈ ఎమ్మెల్యేలు రహస్యంగా మంతనాలు జరిపారు.

విషయం బయటకు రాకుండా

విషయం బయటకు రాకుండా

పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 28 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అయ్యి చర్చించిన విషయాలు బయటకు రాకుండా జాగ్రతలు తీసుకున్నారు. ఈ 28 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కావడంతో పళనిసామి అయోమయంలో పడిపోయారు.

English summary
KP Munuswamy pointed out that Panneerselvam himself had stated yesterday that a conducive atmosphere was evolving in both factions for holding talks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X