• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో.. అదేం వైద్యం రా బాబు.. కళ్లు పొడిచేస్తారు..! త్రిశూలంతో ఒళ్లంతా గుచ్చుతారట..!!

|

రాయ్‌పూర్/హైదరాబాద్ : మూడనమ్మకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిచేసుకున్నాయి. సమాజం అధునాతన సాంకేతికతతో ముందుకు పరుగులు తీస్తున్నప్పటికి మరో పక్క మూఢ నమ్మకాలంటూ కొందరూ ఇంకా వెనకబడిపోతున్నారు. ముఖ్యంగా వైద్యపరమైన అంశాల్లో ఇంకా మూర్ఖత్వాన్ని విడనాదలేదు కొంత మంది ప్రజలు. దీంతో బూత వైద్యం, దయ్యం పట్టిందని, చెట్ల పసర్తు వాడాలని, ఒంటిపై వాతలు పెట్టాలంటూ మూఢ నమ్మకాలనే నమ్ముతున్నారు కొంతమంది అమాయకులు. ఒక్కోసారి ఈ ముఢ నమ్మకాలతో నిండు ప్రాణాలకు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు.

ఇందులో అక్షరం ముక్క చదువురాని తాంత్రికులు, బూత వైద్యులు ప్రదాన భూమిక పోషిస్తుంటారు. బూత వైద్యం పేరుతో రోగులను చిత్రహింసలు పెట్టడం, ఏంటని నిలదీస్తే అది వైద్యంలో భాగమని బుకాయించడం సర్వసాధారణం అయిపోయింది. అచ్చం ఇలాంటి సందర్బమే ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ అభాగ్యురాలిని వైద్యం పేరుతో చిత్ర హింసలు పెట్టి ప్రాణాలను తీసారు తాంత్రిక వైద్యులు.

 The peculier treatment in Jharkhand..!!

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఏ స్థాయిలో ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయో తెలిపే ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. గర్వా ప్రాంతానికి చెందిన రుద్నీ దేవి అనే మహిళ గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయతే ఆమె కుటుంబానికి మూఢ విశ్వాసాలు ఎక్కువ. దీంతో రుద్నీ తల్లితండ్రులు ఆమెను తాంత్రికుల వద్దకు తీసుకెళ్లారు. రుద్నీ రోగాన్ని నయం చేస్తామని చెప్పిన తాంత్రికులు, ఆమెపై వారి విద్యలను ప్రయోగించారు. త్రిశూలంతో శరీరమంతా చిల్లులు పెట్టారు. కళ్లు కూడా పొడిచేశారు. అనారోగ్యంతో సతమతమవుతున్న రుద్నీ, ఈ చిత్ర హింసలను తట్టుకోలేక కన్నుమూసింది.

ఇంత జరిగినా రుద్నీ కుటుంబం మాత్రం తాంత్రికుల చర్య సరైందని బలంగా నమ్మింది. జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలియకుండా ఉండేందుకు రుద్నీ మృత దేహాన్ని ఖననం చేసింది. అయితే ఇతర గ్రామస్తుల ద్వారా ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాంత్రికులు కూడా రుద్నీ ఆరోగ్యం కోసమే ఇదంతా చేశామని పోలీసులకు తెలిపినట్టు సమాచారం. రుద్నీ అనారోగ్యానికి కారణం..దుష్ట శక్తి ఆమెను ఆవహించటమేనని, దీనికి భూతవైద్యమే తగిన పరష్కారమని వారు గుడ్డిగా వాదించినట్టు తెలుస్తోంది.

English summary
The event in Jharkhand shows the extent to which superstitions are torn down by people's lives. Rudney Devi, a woman from Garwa area, has been suffering from illness for the past few weeks. Her family has more superstitious beliefs. Rudney's parents took her to the Wizards. The Wizards, who said that Rudney would cure the disease.The whole body was cast with Trident. The eyes were also stabbed. Rudney, who is struggling with illness, has died to cope with the torture of the Wizards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X