వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైరీ దెబ్బ: పన్నీర్ సెల్వంకు జైలు గ్యారెంటీ: న్యాయశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

శేఖర్ రెడ్డి డైరీ వ్యవహారంపై తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గం ఓ అడుగు ముందుకు వేసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడుకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి డైరీ విషయంలో పన్నీర్ సెల్వంకు చిక్కులు తప్పవని శశికళ వర్గంలోని నాయకులు అంటున్నారు. పన్నీర్ సెల్వం అధికారంలో ఉన్నప్పుడే శేఖర్ రెడ్డి ఎక్కువగా లబ్ధిపొందారని తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీవీ. షణ్ముగం బాంబు పేల్చారు.

<strong>డైరీ దెబ్బకు మైండ్ బ్లాక్: ఆమె ఓకే అంటే ఢిల్లీలో రెడీ, పన్నీర్ చేతిలో సీఎం జుట్టు!</strong>డైరీ దెబ్బకు మైండ్ బ్లాక్: ఆమె ఓకే అంటే ఢిల్లీలో రెడీ, పన్నీర్ చేతిలో సీఎం జుట్టు!

శేఖర్ రెడ్డి ప్రజా పనుల శాఖలో భారీ మొత్తంలో కాంట్రాక్టులు తీసుకున్నారు. తమిళనాడు ఆర్థిక శాఖ, ప్రజపనుల శాఖ మంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్న రోజుల్లో శేఖర్ రెడ్డి అనేక కాంట్రాక్టులు తీసుకున్నారని, శేఖర్ రెడ్డితో పాటు పన్నీర్ సెల్వం జైలుకు వెళ్లే అవకాశం ఉందని ఆ రాష్ట్ర న్యాయశాఖా మంత్రి సీవీ. షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు.

డైరీ దెబ్బ ఎవరికి !

డైరీ దెబ్బ ఎవరికి !

ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంటిలో స్వాధీనం చేసుకున్న డైరీ దెబ్బ ఎడప్పాడి పళనిసామికి పడుతుందా ? పన్నీర్ సెల్వంకు పడుతుందా ? అంటూ ఇప్పుడు చర్చ మొదలైయ్యింది. శేఖర్ రెడ్డి ఎవరెవరికి డబ్బులు ఇచ్చింది క్షుణ్ణంగా డైరీలో రాసి పెట్డడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు.

పళనిసామి వర్గం దూకుడు

పళనిసామి వర్గం దూకుడు

శేఖర్ రెడ్డి డైరీ వ్యవహారంపై తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గం ఓ అడుగు ముందుకు వేసింది. పన్నీర్ సెల్వం కారణంగా శేఖర్ రెడ్డి కోట్ల రుపాయల అక్రమ ఆస్తులు సంపాధించారని తమిళనాడు రాష్ట్ర న్యాయశాఖా మంత్రి సీవీ. షణ్ముగం ఆరోపిస్తున్నారు.

పన్నీర్ వర్గం కౌంటర్

పన్నీర్ వర్గం కౌంటర్

ఆదాయపన్ను శాఖ అధికారుల దగ్గర ఉన్న డైరీ బయటకు వస్తే ఎవరు అవినీతికి పాల్పడ్డారో వెలుగు చూస్తోందని పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు అంటున్నారు. శేఖర్ రెడ్డి శశికళకు చాల సన్నిహితుడు అనే విషయం అందరికి తెలుసని ఆరోపిస్తున్నారు.

భారీ మొత్తంలో కాంట్రాక్టులు

భారీ మొత్తంలో కాంట్రాక్టులు

శేఖర్ రెడ్డి తమిళనాడు ప్రభుత్వానికి చెందిన అనేక కాంట్రాక్టులు తీసుకుని ప్రతిఫలంగా 12 మంది మంత్రులకు భారీ మొత్తంలో ముడుపులు (లంచం) ఇచ్చారని వెలుగు చూసింది. ఆ సందర్బంలో పన్నీర్ సెల్వం సైతం అధికారంలో ఉన్నారు.

శేఖర్ రెడ్డి నోరువిప్పితే అంతే

శేఖర్ రెడ్డి నోరువిప్పితే అంతే

ఆదాయపన్ను శాఖ వలలోపడిన భారీ తిమింగలం శేఖర్ రెడ్డి నోరు విప్పితే అనేక మంది జాతకాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో మంత్రులను అరెస్టు చేస్తే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ పడుతుందని తెలిసింది.

English summary
TN law minister C.V.Shanmugam accuses that at the period of O.Pannerselvam as Public works department minister Sekar Reddy got all the sand contracts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X