వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు కసబ్ కు ఉరి వేశాడు, ఇప్పుడు యాకూబ్

|
Google Oneindia TeluguNews

నాగ్ పూర్: 1993 ముంబై వరస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష అమలు చెయ్యడానికి రోజులు దగ్గర పడ్డాయి, నాగ్ పూర్ సెంట్రల్ జైలులో జులై 30వ తేది ఉదయం 7 గంటలకు యాకూబ్ మెమెన్ కు ఉరి వెయ్యడానికి సర్వం సిద్దం చేస్తున్నారు.

2012 నవంబర్ 21వ తేదిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ కు ఉరి వేసిన వ్యక్తి జులై 30వ తేదిన యాకూబ్ మెమెన్ కు ఉరి వేస్తాడని నాగ్ పూర్ సెంట్రల్ జైలు అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే కసబ్ కు ఉరి వేసిన వ్యక్తిని నాగ్ పూర్ జైలుకు పిలిపించారు.

The person who carried out the execution of Ajmal Kasab is most likely to hang Yakub Memon as well

ఉరి శిక్ష అమలు చేసే సమయంలో ఉరి తీస్తున్న వ్యక్తి మానసికంగా సిద్దంగా ఉండాలి. నిందితుడి గొంతుకు ఉరి తాడు గట్టిగా బిగించాలి. ఉరి తీసే ముందు జైలు అధికారులు ఉరి తీసే వ్యక్తికి కొన్ని నియమ నిబంధనలు, సూచనలు ఇస్తారు.

అంతే కాకుండ ఉరి శిక్షకు గురైన యాకూబ్ మెమెన్ కు వైద్యులు ఎప్పటికప్పుడు వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు. యూకూబ్ మెమెన్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలుసుకున్న తరువాతే ఉరి శిక్ష అమలు చెయ్యాలని నియమాలు ఉన్నాయి.

యాకూబ్ మెమెన్ జైలులో మౌనం పాటిస్తున్నాడు. గురువారం యూకూబ్ అతని కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అతని న్యాయవాదులు ఒక సారి కలుసుకున్నారు. కసబ్ కు ఉరి తీసిన వ్యక్తి నిజంగా హ్యాంగ్ మ్యాన్ కాదు, అతని వృత్తి అది కాదు. ఇప్పుడు యాకూబ్ కు ఉరి తియ్యడానికి అతను సిద్దంగా ఉన్నాడు.

English summary
The person who carried out the execution of Ajmal Kasab is most likely to hang Yakub Memon as well. He had been summoned nearly 15 days back when the Maharashtra government had decided on the date of hanging.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X