వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

65 సంవత్సరాల్లో అతి తక్కువ వర్షపాతం...

|
Google Oneindia TeluguNews

రానున్న రోజుల్లో నీటీ కటకట మరింత ఇబ్బంది పెట్టనుందా.. ఇప్పటికే వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు నీటీ కటకట ఎదుర్కోక తప్పదా.. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నారు వాతవరణాన్ని అంచనా వేస్తున్న పర్యావరణ వేత్తలు...ఈనేపథ్యంలోనే గత 65 సంవత్సరాల్లో ఎప్పుడు లేనట్టుగా దేశ వ్యాప్తంగా కురిసే వర్షాపాతం తక్కువగా నమోదైందని స్కైమేట్ అనే ప్రవేట్ వాతవరణ ఎజెన్సీ ప్రకటించింది.

ఈనేపథ్యంలోనే రానున్న సంవత్సరంలో వర్షాలు కొంత తగ్గవచ్చని అంచన వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రీ మాన్‌సూన్‌లో భాగంగా గత మూడు నెలల్లో కురిసిన వర్షపాతం 25శాతం తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇక ఇందులో భాగంగానే నార్త్‌ఈస్ట్ 30శాతం, సెంట్రల్ ఇండియాలో 18 శాతం ఈశాన్య రాష్ట్ర్రాల్లో 14శాతం సౌత్ రాష్ట్ర్రాల్లో 47 శాతం వర్షపాతం తక్కువగా నమోదైనట్టు పేర్కోన్నారు.

the pre-monsoon rainfall in the country was the second lowest in 65 years

దీంతో పలు పంటలకు ఇబ్బందికరంగా మారనున్నట్టు నిపుణులు తెలిపారు. కాగా మొత్తం 65 సంవత్సరాల వర్షపాత చరిత్రలో 2012లో ఇదే విధంగా 30 శాతం వర్షపాతం తక్కువగా నమోదైందని, కాగా ఇదే పరిస్థితి 2019లో కొనసాగుతుందని ప్రకటించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.మరోవైపు జూన్ మొదటి వారంలో రావల్సిన రుతుపవనాలు మరో వారం రోజుల తర్వాత కేరళా తీరాన్నీ తాకే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీంతో మరో నెల రోజుల అయితే గాని వర్షపాతం పూర్తిగా దేశాన్ని చుట్టే అవకాశాలు కనిపించడం లేదు.

English summary
the pre-monsoon rainfall in the country was the second lowest in 65 years, private weather forecaster Skymet Weather said Monday.The three-month pre-monsoon season March, April and May ended with a rainfall deficiency of 25 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X