వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయ నిపుణుల సూచనల ఆధారంగానే: శబరిమలలో మహిళల ప్రవేశంపై కేరళ మంత్రి శైలజ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై న్యాయ నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా వ్యాఖ్యానించారు. నవంబర్ 16న అయ్యప్ప ఆలయం తెరవడం.. భక్తులను అనుమతించడం జరుగుతుందని చెప్పారు.

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని పిటిషనర్ నాయర్ సర్వీస్ సొసైటీ పేర్కొంది. ప్రధాన పిటిషనర్లలో ఒకరైన నాయర్ సర్వీస్ సొసైటీ.. సుప్రీంకోర్టు నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేసింది. నమ్మకాలకు, నమ్మినవారి విజయంగా భావిస్తున్నట్లుగా తెలిపింది.

The question is whether the women should enter or not? That will beexplained by legal experts: Keralas Health Minister

సుప్రీంకోర్టు పెద్ద బెంచ్ తీర్పు వెలువరించే వరకూ కేరళ ప్రభుత్వం అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవాలని రాయల్ పండళం ఫ్యామిలీ ప్రతినిధి సువీ దుతి సుందరం కోరారు. గత తీర్పుపై ఎలాంటి స్టే ఇవ్వకుండా.. సుప్రీంకోర్టు రివ్యూను పెద్ద బెంచ్‌కి రెఫర్ చేయడం గమనార్హం.

తాము ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుకూలమని, మహిళలకు కూడా సమాన అవకాశాలుండాలని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ అన్నారు. అయితే, ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చే తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు.

కాగా, అయ్యప్ప ఆలయ తలుపులు మరో రెండు రోజుల్లో తెరుచుకోనున్న సమయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ తీర్పును పున:సమీక్షించాలని దాఖలైన పిటిషన్లను పెండింగ్‌లో ఉంచింది. రివ్యూ పిటిషన్లతోపాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని కోర్టు తెలిపింది. అయితే, మతంలోని అందర్గత అంశాల్లో భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని పిటిషనర్లు కోరినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

మతం అనేది మనిషికి, దైవానికి అనుసంధానం చేసేది మాత్రమే. మహిళలకు గానూ ప్రవేశానికి నిబంధనలు విధించడం జరగదు. శబరిమలలో మహిళలకు ప్రవేశం అనేది ఈ ఒక్క మతంతో ఆగదు. ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మసీదుల్లోకి మహిళల ప్రవేశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది అని సుప్రీంకోర్ు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు.

Recommended Video

Sabarimala Verdict : Supreme Court Refers Case To Larger Bench || Oneindia Telugu

మతంలో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు ఉందా?అనే అనే అంశం ఇప్పుడు చర్చకు వచ్చిందని తెలిపారు. శబరిమల వ్యవహారాన్నిఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసే అంశంపై 3.2 మెజార్టీతో తీర్పు వెలువడింది. అయితే, గతంలో తాము ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించింది.

English summary
Kerala's Health Minister KK Shailaja said that "The temple will be opened on 16th and devotees will go. The question is whether the women should enter or not? That will be explained by legal experts and the government accordingly."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X