వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక తీర్పులు: రఫేల్, రాహుల్ గాంధీ ధిక్కార కేసు: పూర్తి వివరాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రపేల్ ఒప్పందం కేసు రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం తీర్పును వెలువరించనుంది. ఫ్రాన్స్ నుంచి రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన డీల్ మేరకు 36 పూర్తిగా ఆయుధాలతో నింపబడిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు ఎన్డీఏ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలైంది.

రఫేల్ డీల్‌కు క్లీన్‌చిట్ ఇస్తూ డిసెంబర్ 14, 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ కోరుతూ మాజీ కేంద్రమంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు పిటిషన్ దాఖలు చేశారు.

'చౌకీ దార్ ఛోర్ హై’: దోషిగా తేలితే రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడుతుందా?'చౌకీ దార్ ఛోర్ హై’: దోషిగా తేలితే రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడుతుందా?

కేంద్రానికి సుప్రీం క్లీన్ చిట్..

కేంద్రానికి సుప్రీం క్లీన్ చిట్..

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్రానికి క్లీన్ చిట్ ఇస్తూ 2018, డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇండియా-ఫ్రాన్స్ అంతర్గత ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా డసాల్ట్ అనే ఫ్రెంచ్ కంపెనీ నుంచి 36 రఫేల్ విమానాలను కొనుగోలు చేసేందుకు జరిగిన ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యుద్ధ విమానాల నాణ్యతలో లోపం లేనప్పుడు వాటి ధరలపై విశ్లేషించాల్సిన పని తమది కాదని తేల్చి చెప్పింది. డసాల్ట్ తన భారత భాగస్వామిని ఎంచుకోవడంలో కూడా ఎలాంటి తప్పు జరగలేదని వ్యాఖ్యానించింది. అంతేగాక, దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను డిస్మిస్ చేసింది. రఫేల్ విమానాల ధరలపై, కొనుగోలు పక్రియపై ఎలాంటి రివ్యూ, విచారణ అవసరం లేదని తెలిపింది.

సందేహించాల్సిందేమీ లేదు..

సందేహించాల్సిందేమీ లేదు..


వాణిజ్య సానుకూలతలు ఏమీ లేవని కోర్టు స్పష్టం చేసింది. విమానాల కొనుగోలు ప్రక్రియలో సందేహించాల్సిన విషయాలేమీ లేవని తెలిపింది. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నంత మాత్రాన ఒప్పందాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అన్ని విషయాలు కోర్టు పరిశీలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. వ్యక్తుల అభిప్రాయాల ఆధారంగా రక్షణ సంబంధ విషయాల్లో విచారణ చేయలేమని పేర్కొంది. ప్రభుత్వం 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తే.. కోర్టు ఆ ఒప్పందంలోని ప్రతి విషయాన్ని పరిశీలించదని తెలిపింది. ఎలాంటి అవకతవకలు జరగనప్పుడు జోక్యం చేసుకోవాల్సని అవసరం ఉండదని స్పష్టం చేసింది.

రివ్యూ పిటిషన్ పై తీర్పు రిజర్వు..

రివ్యూ పిటిషన్ పై తీర్పు రిజర్వు..

అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఒప్పందంలో వాస్తవ విషయాల్ని కోర్టుకు చెప్పకుండా కేంద్రం తొక్కిపెట్టిందని ఆరోపిస్తూ మాజీ కేంద్రమంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు జనవరిలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మే 10న తీర్పును రిజర్వులో పెట్టింది.

అనేక తప్పులంటూ రివ్యూ పిటిషన్లు..

అనేక తప్పులంటూ రివ్యూ పిటిషన్లు..

అనేక తప్పుడు చర్యలు, అవసరమైన సమాచారాన్ని దాచిపెట్టడం ద్వారా రఫేల్ ఒప్పందం జరిగిందని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, పిటిషనర్ల ఆరోపణలను వ్యతిరేకించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. సమీక్ష పిటిషన్లను తిరస్కరించాలని కోరారు. ఈ పిటిషన్లకు ఎలాంటి విచారణ యోగ్యతా లేదని అన్నారు. కాగా, ఈ కేసులో కొత్త సాక్ష్యాధారాలను సుప్రీంకోర్టు అనుమతించింది. కొత్త సాక్ష్యాధారాలను రివ్యూ పిటిషన్లో భాగంగా అనుమతించినట్లు తెలిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది.

చోరీకి గురైన పత్రాలు పత్రికలో..

చోరీకి గురైన పత్రాలు పత్రికలో..


రఫేల్ పత్రాలు చోరీ అయ్యాయని ఏజీ కోర్టుకు చెప్పారు. జాతీయ దినపత్రిక ‘ది హిందూ' దానిని ప్రచురించిందన్నారు. ప్రభుత్వం ఈ కేసులో ఏం దర్యాప్తు చేసిందని సీజేఐ.. ఏజీని ప్రశ్నించారు. ఫైల్ ఏ విధంగా చోరీ అయ్యిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని వేణుగోపాల్ చెప్పారు. గోప్యంగా ఉంచాల్సిన పత్రాలను ది హిందూ పత్రిక ప్రచురించిందని ఏజీ చెప్పారు.
ది హిందూ పత్రిక రఫేల్ ఒప్పందానికి సంబంధించిన చాలా రిపోర్టులు ప్రచురించిందని, ఈ ఒప్పందం కోసం ప్రభుత్వం చాలా నిబంధనలు ఉల్లంఘించిందని అందులో రాశారని ఆయన కోర్టుకు వివరించారు.

కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..

కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..

అంతేగాక, రక్షణ ఒప్పందాలు దేశ భద్రత కోసం జరుగుతాయని, అది చాలా సున్నితమైన అంశమని తెలిపారు. ఇవన్నీ మీడియా, కోర్టు, పబ్లిక్ డిబేట్లలో బయటికొస్తే.. వేరే దేశాలు మనతో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి వెనుకడుగు వేయవచ్చని ఆయన చెప్పారు. దేశ సౌర్వబౌధికారం, ఏకత్వం, విదేశీ ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను ఎవరైనా వ్యక్తి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఉపయోగించడం చట్టం విరుద్ధమని, దీనిని గోప్యతా చట్టం ఉల్లంఘనగా భావించి రివ్యూ పిటిషన్ ను తోసిపుచ్చాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ఈ కేసులో అపహరించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవద్దనే ప్రభుత్వ అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

రాహుల్ గాంధీ ధిక్కార కేసు..

రాహుల్ గాంధీ ధిక్కార కేసు..

కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కారణ కేసులోనూ సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చే అవకాశముంది. రఫేల్‌పై సుప్రీంకోర్టు తీర్పు సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘చౌకీదార్ చోర్ హై' అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నినాదాన్ని రఫేల్ తీర్పునకు వర్తింపజేసినందుకుగానూ రాహుల్ గాంధీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. కాగా, కోర్టు తీర్పునకు రాహుల్ గాంధీ ‘చౌకీదార్ చోర్ హై'అనే నినాదాన్ని తప్పుగా అన్వయించారని ఆయనపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించనుంది.

English summary
The Supreme Court will deliver its verdict on a review petition in the Rafale case on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X