• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వద్దంటే వెళ్లింది.!కరోనా తెచ్చుకుంది.!ఐశ్వర్యకు కరోనా సోకడానికి కారణం అదే అంటున్న సన్నిహితులు.!

|

ముంబాయి/హైదరాబాద్ : కరోనా వైరస్ ఎవరిని కబళిస్తుందో ఎవరిని కనికరిస్తుందో అర్దంకాని పరిస్థితులు తలెత్తాయి. అద్దాల మేడలాంటి ఇంధ్ర భవనాల్లో ఉంటున్నా పరమ చెత్తతో పేరుకుపోయిన మురికి వాడల్లో ఉంటున్నా ఏమాత్రం భేదాభిప్రాయాలు లేకుండా కరోనా వైరస్ కాటేస్తోంది. ధనిక - పేద, సామాన్య -సెలబ్రిటీ తేడా లేకుండా కరోనా పంజా విసురుతోంది. నిన్నటి వరకు ఒకెత్తు ఇప్పుడొకెత్తు అన్నట్టు దేశంలో కరోనా విజృంభిస్తుంటే ఉలిక్కి పడ్డ మాట వాస్తవమే గానీ అత్యంత ఖరీదైన ప్రదేశంలో అత్యంత విశాలమైన భవంతిలో నివాసముంటున్న అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కరోనా వైరస్ సోకడంతో యావత్ ప్రపంచం అవాక్కవుతోంది.

ఐశ్వర్య రాయ్‌కు కరోనా.. విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న అభిమానులు...

ఐశ్వర్య రాయ్‌కు కరోనా.. విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న అభిమానులు...

అంతే కాకుండా ప్రపంచ మాజీ అందగత్తె ఐశ్వర్యారాయ్ కి కూడా కరోనా సోకడం పట్ల ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అంతటి అధునాతన వసతుల మధ్య నివాసం, ఎన్నో ముందుజాగ్రత్తలు, అత్యంత మన్నికైన సానిటైజర్లు, ఇమ్యూనిటీ పెంచే విటమిన్లు, 24/7అందుబాటులో ఉండే వైద్యులు వెంట ఉంటున్నప్పటికి అమితాబ్ బచన్ కుటుంబానికి కరోనా సోకడం పట్ల యావత్ ప్రపంచం విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ కు కరోనా సోకిందనే వార్తను ఎవ్వరూ కూడ జీర్ణించుకోలేని అంశంగా మారింది.

కొంప ముంచిన ఆంక్షల సడిలింపులు.. అమితాబ్ కు స్టూడియోలోనే కరోనా సోకిందంటున్న సన్నిహితులు..

కొంప ముంచిన ఆంక్షల సడిలింపులు.. అమితాబ్ కు స్టూడియోలోనే కరోనా సోకిందంటున్న సన్నిహితులు..

అంతే కాకుండా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌కు కూడా కరోనా సోకిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె ప్రకటించారు. ఐశ్వర్య, ఆమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌గా టెస్టుల్లో నిర్ధరణ అయిందని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆమె భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్‌లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా జయా బచ్చన్‌కు టెస్ట్ రిజల్ట్ నెగటివ్ వచ్చిందని రాజేశ్ తోపె ట్వీట్ చేశారు. రాజేష్ పెట్టిన ట్వీట్ ఎంత సంచలనంగా మారిందో అంతే వివాదంగా కూడా పరిణమించింది. ఇతర సెలబ్రిటీల వ్యక్తిగత సమాచారం ఎలా బహిర్గతం చేస్తారనే దిశగా విషయం పక్కదోవ పట్టినట్టు తెలుస్తోంది.

ఉలిక్కపడుతున్న ప్రపంచ దేశాల అభిమానులు.. అందగత్తెకు కరోనా పట్ల కలవరపడుతున్న ఫాన్స్..

ఉలిక్కపడుతున్న ప్రపంచ దేశాల అభిమానులు.. అందగత్తెకు కరోనా పట్ల కలవరపడుతున్న ఫాన్స్..

దీంతో ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఆయన ఆ ట్వీట్‌ను తొలంగించినట్టు తెలుస్తోంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ట్వీట్ చేసిన ఆయన కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసారు. కోవిడ్ బాధితులు ఎవరికి వారు తమ సమాచారాన్ని బహిర్గతం చేసుకోవచ్చు కానీ ఇతరులు బయటపెట్టడం నేరం అవుతుంది. అందుకే ఆయన తన ట్వీట్ ఆఘమేఘాల మీద డిలీట్ చేసారు. ఇదిలా ఉండగా అసలు అంత ముందస్తు జాగ్రత్తల, ఖరీదైన, మన్నికైన శానిటైజేషన్ సౌకర్యాల మద్య నివసించే ఐశ్వర్యకు కరోనా ఎలా సోకింది, ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్లింది అనే అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  RGV Reacts To Amitabh Bachchan Testing Positive For Covid-19 || Oneindia Telugu
  మామను పికప్ చేసుకోవడానికి వెళ్లింది.. కరోనా తెచ్చుకుందంటున్న ఐస్ మేనేజర్..

  మామను పికప్ చేసుకోవడానికి వెళ్లింది.. కరోనా తెచ్చుకుందంటున్న ఐస్ మేనేజర్..

  ఐశ్వర్య రాయ్‌కు కరోనా వైరస్ సోకడం పట్ల దేశ వ్యాప్తంగా చిత్ర విచిత్ర చర్చ జరుగుతోంది. ముంబాయిలో లాక్‌డౌన్ ఆంక్షలు తొలగించిన తర్వాత ముంబాయి చిత్రపరిశ్రమతో పాటు టీవీ రంగానికి సంబంధించిన చర్చలు పునఃప్రారంభమయ్యాయి. అతి కొద్ది మంది సమక్షంలో అత్యంత ముందు జాగ్రత్తల మధ్య ఈ చర్చలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే సందర్బంలో ఓ టీవి షో చర్చ నేపథ్యంలో జూహూలోని ఓ స్టూడియోకి వెళ్లిన అమితాబ్ బచ్చన్ కు అక్కడ ఆలస్యమైట్టు సమాచారం. దీంతో మామ అమితాబ్ ను పికప్ చేసుకునేందుకు స్వయంగా ఐశ్వర్య కారులో వెళ్లిందని, వెళ్లిన 20నిమిషాల్లోనే వారిద్దరూ ఇంటికి చేరుకున్నట్టు ఐశ్వర్య మేనేజర్‌ అర్చనా సదానంద్‌ లెహెంగా తన సహచరులతో చర్చించినట్టు తెలుస్తోంది. ఆ సందర్బంగానే ఐశ్వర్యకు కరోనా మైల్డ్ గా సోకినట్టు అత్యంతా గోప్యంగా చర్చ జరుగుతోంది.

  English summary
  The whole world is in awe of Amitabh Bachchan's family being infected with corona despite the presence of doctors available 24/7. In particular, the news that Aishwarya Rai was infected that no one can digest.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more