వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రికార్డు రాహుల్ గాంధీది కాదు, మరెవరిదీ..

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Gandhi Coronation : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తొలి ప్రసంగం

న్యూఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పేరు ఓ విషయంలో రికార్డుల్లోకి ఎక్కుతుందని అందరూ భావిస్తూ వస్తున్నారు. అతి చిన్నవయస్సులో కాంగ్రెసు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకన్న నాయకుడిగా ఆయన రికార్డు సాధించారని అనుకుంటున్నారు.

కానీ, ఆ రికార్డు రాహుల్ గాందీది కాదని తెలుస్తోంది. రాహుల్ గాంధీ 47 వయస్సులో కాంగ్రెసు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, అంతకన్నా చిన్న వయస్సులో ఎఐసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేత మరొకరు ఉన్నారు.

ఆ రికార్డు ఎవరిదంటే..

ఆ రికార్డు ఎవరిదంటే..

తక్కువ వయస్సులో కాంగ్రెసు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రికార్డు మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్‌ పేరిట ఉన్నట్లు కాంగ్రెసు రికార్డులను పరిశీలిస్తే అర్థమవుతుంది. 35 ఏళ్ల వయస్సులో ఆజాద్‌ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల ఆ రికార్డు కాదని తేలిపోయింది.

35 ఏళ్లకే ఆజాద్...

35 ఏళ్లకే ఆజాద్...

కాకినాడలో 1923లోనిర్వహించిన సమావేశంలో మహ్మద్‌ అలీ జవహార్ ను కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే అదే ఏడాది ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తిరిగి ఆజాద్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పటికీ ఆయన వయసు 35 ఏళ్లు మాత్రమే.

కుటుంబంలో కూడా..

కుటుంబంలో కూడా..

రాహుల్ గాంధీ కుటుంబంలో కూడా ఆ రికార్డు ఆయనది కాదు. 1929 లాహోర్‌ సమావేశంలో జవహార్‌లాల్‌ నెహ్రూను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పటికీ ఆయన వయసు 40 ఏళ్లు. పోనీ స్వాతంత్ర్యం తర్వాత రికార్డు చూసుకున్నా 41 ఏళ్లకే రాజీవ్‌ గాంధీ (1985లో) ఆ బాధ్యతలు స్వీకరించారు.

ఆ రకంగా రాహుల్ గాంధీ కారు..

ఆ రకంగా రాహుల్ గాంధీ కారు..

ఆ లెక్కన చూస్తే అతి చిన్న వయస్సులో కాంగ్రెసు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేతగా రికార్డు రాహుల్ గాంధీకి దక్కకుండా పోయింది. అయితే, రాహుల్ గాంధీ ముందు కాంగ్రెసు అధ్యక్షుడిగా పలు సవాళ్లు ఉన్నాయి.

English summary
Rahul gandhi has created record as AICC president, Record is on Moulana Abul Kalam Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X