వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దెబ్బకు దెబ్బ: తమిళనాడులో పెప్సీ, కోకాకోలా బ్యాన్

జల్లికట్టు నిర్వహించే వరకు తమిళనాడులో పెప్సీ, కోకాకోలా విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని వ్యాపారులు నిర్ణయించారు. జల్లికట్టు నిర్వహణకు విదేశీ శక్తులు అడ్డుపడుతున్నాయని ఆరోపిస్తూ మెరీనా బీచ్ లో పెప్సీ,

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో జల్లికట్టు నిర్వహించాలని చేస్తున్న ఆందోళనకు గంటగంటకు మద్దతు పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా జల్లికట్టు నిర్వహించే వరకు తమిళనాడులో పెప్సీ, కోకాకోలా విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని వ్యాపారులు నిర్ణయించారు.

షాక్: ఈ వీడియో చూశాక కూడా జల్లికట్టు వద్దంటారా ! (వీడియో)

జల్లికట్టు నిర్వహణకు విదేశీ శక్తులు అడ్డుపడుతున్నాయని మెరీనా బీచ్ లో విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఇదే సమయంలో పెప్సీ, కోకాకోలా శీతలపానీయాలను కింద ఇసుకలో పోసి నిరసన వ్యక్తం చేశారు.

The retail shops in Tamil Nadu have decided to not selling coke, pepsi

విషయం తెలుసుకున్న వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాకు లాభాలకంటే తమిళ సాంప్రదాయం ముఖ్యం, అందుకోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్దం అని వ్యాపార సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.

దెబ్బ అంటే ఇదే: జల్లికట్టు ధర్నాలో యూనీఫాంలో పోలీస్

తమిళనాడులో జల్లికట్టు నిర్వహించే వరకు రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పెస్పీ బాటిల్, కోకాకోలా శీతల పానీయాలు విక్రయించరాదని శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెప్సీ, కోకాకోలా తాగకపోయినా తాము జీవిస్తామని, అంతే కాని తమిళనాడులో ఎన్నో ఏళ్లగా సాంప్రదాయంగా వస్తున్న జల్లికట్టును మాత్రం వదులుకోమని విద్యార్థి సంఘాల నాయకులు తెల్చి చెప్పారు.

పెప్సీ, కోకాకోలా శీతలపానీయాలు విక్రయిస్తున్న వ్యాపారులు, చిల్లర వ్యాపారులు విద్యార్థి సంఘాల నాయకులు తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు. మొత్తం మీద జల్లికట్టు పోరాటం రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది.

English summary
Tamil Nadu Jallikattu: The retail shops in Tamil Nadu have decided to not selling coke, pepsi till the govt of India impose ban on PeTA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X