వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాధానాలు కాదు.. పరిష్కారం కావాలి... పిల్లల మరణాలపై సీఎం నితీష్ కుమార్‌కు సుప్రిం అంక్షింతలు..

|
Google Oneindia TeluguNews

గత కొద్ది రోజులుగా బీహార్‌లోని ముజఫర్‌ఫర్‌పూర్ జిల్లాలో వందలాదీ చిన్నారుల ప్రాణాలు హరించుకు పోవడంపై సుప్రిం కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఇప్పటికే 160కి పైగా చిన్నారులు మెదడు వాపు వ్యాధితో మ‌ృత్యువాత పడుతున్న నేపథ్యంలో కోర్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అంక్షింతలు వేసింది. చిన్నారుల మరణాలు వారికి అందిస్తున్న వైద్య సహాయంపై వారం రోజుల్లోగా నివేదిక అందించాలని నోటీసులు జారీ చేసింది.

బీహార్‌లో రాష్ట్ర్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో చిన్నారుల ప్రాణాలను హరిస్తున్న మెదడు వాపు వ్యాధి మరణాలపై ప్రభుత్వం సరిగా పట్టించుకోవడంలేదని ,పిల్లలకు వైద్యం అందించందుకు వైద్యులు కూడ అందుబాటులో ఉండడం లేదని ఈనేపథ్యంలోనే సుప్రిం కోర్టు జోక్యం చేసుకోవాలంటూ బీహార్‌కు చెందిన ఎస్. అజ్మాని అనే వ్యక్తి సుప్రింలో పిల్ వేశాడు. దీంతో సుప్రిం కోర్టు ముజఫర్‌పూర్ మరణాలపై సీరియస్ అయింది.

Recommended Video

ఎన్డీఏ ను కేంద్రంలో గద్దెక్కనివ్వం - గులాం నబీ అజాద్
The SC sought a response Bihar government on the issue of the deaths

పిల్లల మరణాలకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రిం కోర్టుకు అందించాలని ప్రభుత్వాన్ని అదేశించింది. వ్యాధిని ఎదుర్కోనేందుక నితీష్ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో పాటు ప్రస్థుతం అందిస్తున్న వైద్య సహాయంపై అఫిడవిట్ అందించాలని ఆదేశించింది. ఇక ముందు ఇలాంటీ పరిస్థితి కొనసాగడానికి వీళ్లేదని సుప్రిం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..తూతూ మంత్రపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని ప్రభుత్వాన్ని సూచించింది. మరోవైపు నితీష్ కుమార్ మరణాలపై సరిగా స్పందించడం లేదని మీడీయా ప్రశ్నించినా ఆయన స్పందించడం లేదు.అయితే మృతుల కుటుంభాలకు మాత్రం ముఖ్యమంత్రి నితీష్ ప్రభుత్వం నాలుగు లక్షల రుపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంది.

English summary
The Supreme Court on Monday sought a response within seven days from the Centre and Bihar government on the issue of the deaths of more than 100 children in Muzaffarpur due to the outbreak of acute encephalitis syndrome (AES).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X