వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు యడ్యూరప్ప, నేడు కుమారస్వామికి అగ్నిపరీక్ష, క్రాస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు, నో ఎంట్రీ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్ష నెగ్గడం కష్టమే

బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయిన హెచ్.డి. కుమారస్వామి శుక్రవారం మద్యాహ్నం జరిగే అగ్నిపరీక్షలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని తన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు జేడీఎస్, అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇరు పార్టీల నాయకులు చర్చలు జరుపుతున్నారు. క్రాస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. విధాన సౌధ ఉద్యోగులకు నో ఎంట్రీ అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

బెంగళూరు హోటల్

బెంగళూరు హోటల్

బెంగళూరులోని ప్రైవేట్ హోటల్ లో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు బసచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడకుండా శుక్రవారం ఉదయం మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ వారితో చర్చలు జరుపుతున్నారు.

నందీహిల్స్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలు

నందీహిల్స్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలు

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)కు 30 కిలోమీటర్ల దూరంలోని నందీహిల్స్ సమీపంలో ఉన్న విలాసవంతమైన రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు బసచేశారు. ఇప్పటికే జేడీఎస్ ఎమ్మెల్యేలతో హెచ్.డి. రేవణ్ణ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార్ స్వామి కుమారుడు, హీరో నిఖిల్ చర్చలు జరిపి క్రాస్ ఓటింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

బీజేపీ నాయకుల ఆశలు

బీజేపీ నాయకుల ఆశలు


2018లో కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 104 ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుని అతి పెద్దపార్టీగా అవతరించింది. మే 17వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడ్యూరప్ప మే 19వ తేదీన అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోలేక సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి కుమారస్వామిని సీఎం కుర్చీలోంచి కిందుకు దించుతారని బీజేపీ ఆశలు పెట్టుకుంది.

స్పీకర్ ఎన్నికలకు పోటీ

స్పీకర్ ఎన్నికలకు పోటీ

శుక్రవారం మద్యాహ్నం 12.15 గంటలకు కర్ణాటక స్పీకర్ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక తాత్కాలిక స్పీకర్ కేజీ. బోపయ్య స్పీకర్ ఎన్నికలు నిర్వహిస్తారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నుంచి మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్, బీజేపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి ఎస్. సురేష్ కుమార్ స్పీకర్ పదవికి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో కేఆర్. రమేష్ కుమార్ స్పీకర్ గా ఎన్నిక అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

సీఎంకు అగ్నిపరీక్ష

సీఎంకు అగ్నిపరీక్ష

బెంగళూరులోని ప్రైవేట్ హోటల్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం మద్యాహ్నం నేరుగా విధాన సౌధకు చేరుకుంటారు. నందీహిల్స్ సమీపంలోని రిసార్టులో బసచేసిన జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రైవేటు బస్సులో నేరుగా విధాన సౌధ చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సీఎంగా బలపరీక్షలో మెజారిటీ శాసన సభ్యుల మద్దతుకూడగట్టుకోవడానికి సిద్దం అయ్యారు.

ఎమ్మెల్యేలకు విప్ జారీ

ఎమ్మెల్యేలకు విప్ జారీ

బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నాయకత్వం విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన 37 మంది ఎమ్మెల్యేలకు (సీఎం కుమారస్వామి రామనగర శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు) ఆ పార్టీ నాయకత్వం విప్ జారీ చేసింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు.

ఉద్యోగులకు సెలవు

ఉద్యోగులకు సెలవు

సీఎం కుమారస్వామి బలపరీక్ష సందర్బంగా విధాన సౌధలో, వికాస సౌధలోని బహుల అంతస్తుల్లో ప్రభుత్వ ఉద్యోగ శాఖలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శుక్రవారం అర్దరోజు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పాటు ఇతరులను ఎవ్వరినీ విధాన సౌధ లోపలికి అనుమతించరు. ఎమ్మెల్యేల గన్ మ్యాన్ లను సైతం విధాన సౌధ లోపలికి అనుమతించరు. మీడియా సభ్యులు (ఒక్క రిపోర్టర్, ఒక్క కెమెరా మెన్)ను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. విధాన సౌధ పరిసర ప్రాంతాల్లో ఒక్క కిలోమీటరు పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు.

English summary
The stage is set for the Congress-JD(S) alliance government floor test in Karnataka assembly on May 25, 2018. Chief Minister H.D.Kumaraswamy to prove majority on the floor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X