వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాహుబలి-2 దెబ్బకు సీఎం దిమ్మతిరిగింది: జీవో జారీ, మల్టీఫ్లెక్స్ లో బ్రేక్

దాదాపు రూ. 50 వేలు ఖర్చు చేసి బాహుబలి-2 సినిమా చూశారని కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై విమర్శలు రావడంతో ఇక ముందు కర్ణాటకలోని మల్టీఫ్లెక్స్, అన్ని సినిమా థియేటర్లలో టిక్కెట్ ధర గరిష్టంగా రూ. 200 కంటే ఎక్కువ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మల్టీఫ్లెక్స్, సినిమా థియేటర్లలో ఇక ముందు సినీ అభిమానులను నిలువు దోపిడీ చెయ్యకుండా కర్ణాటక ప్రభుత్వం కళ్లెం వేసింది. మల్లీఫ్లెక్స్, అన్ని సినిమా థియేటర్లలో ఇక ముందు టిక్కెట్ ధర రూ. 200 కు మించకుడా చూడటానికి కఠిన చర్యలు తీసుకుంది.

బాహుబలి-2 చూసిన సీఎం: రూ. 50 వేలకు టిక్కెట్లు ! దుమ్మెత్తిపోశారు, అయితే ?బాహుబలి-2 చూసిన సీఎం: రూ. 50 వేలకు టిక్కెట్లు ! దుమ్మెత్తిపోశారు, అయితే ?

సినిమా థియేటర్లలో రూ. 200 కంటే ఎక్కువ ధరకు టిక్కెట్లు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ జీఓ జారీ చేసింది. అయితే మల్టీ ఫ్లెక్స్ లోని ఐ-మాక్స్, 4 డి ఎక్స్, గోల్డ్ క్లాస్ స్క్రీన్, గోల్డ్ క్లాస్ సీట్ల టిక్కెట్లకు ఈ నియమాలు వర్తించవని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

 కన్నడ సినిమాలు

కన్నడ సినిమాలు

బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని ఇతర నగరాల్లో ఉన్న మల్టీఫ్లెక్స్, అన్ని థియేటర్లలో కన్నడ సినిమాల టిక్కెట్ గరిష్టంగా రూ. 200కు విక్రయించాలి. అంతకంటే ఎక్కు ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తూ జీవో జారీ చేసింది.

 తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్

తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ,తమిళ బాషల చిత్రాలకు 30 శాతం అధికంగా టిక్కెట్ల ధర నిర్ణయించారు. పరబాషా చిత్రాలకు 30 శాతం పన్ను విధించారు. అంటే తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ సినిమా టిక్కెట్ ధర గిరిష్టంగా రూ. 260 నిర్ణయించారు.

దుబాయ్ పర్యటనతో

దుబాయ్ పర్యటనతో

మల్లీఫ్లెక్స్, సినిమా థియేటర్లలో ఒక్కో టిక్కెట్ ధర రూ. 200 మించి విక్రయించరాదని ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అధికారులు ఓ ఫైల్ సిద్దం చేశారు. అయితే అత్యవసరంగా సీఎం సిద్దరామయ్య గురువారం దుబాయ్ బయలుదేరి వెళ్లడంలో జీవో విడుదల కావడం ఆలస్యం అయ్యింది.

 బాహుబలి-2 పంటపండింది

బాహుబలి-2 పంటపండింది

గురువారం దుబాయ్ వెళ్లే ముందు సీఎం సిద్దరామయ్య ఫైల్ మీద సంతకం చేసి ఉంటే బాహుబలి-2 సినిమా టిక్కెట్ ధర రూ. 260కే పరిమితం అయ్యేది. అయితే ఆయన జీవోలో సంతకం చెయ్యకపోవడంతో బాహుబలి-2 సినిమా టిక్కెట్ ధర రూ. 500 నుంచి రూ. 1,000 వరకు విక్రయించారు.

బాహుబలి-2 సినిమాకు సీఎం చేసిన ఖర్చు రూ. 50 వేలు !

బాహుబలి-2 సినిమాకు సీఎం చేసిన ఖర్చు రూ. 50 వేలు !

బాహుబలి-2 సినిమా చూడటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులోని ఓరియన్ మాల్ లోని పీవీఆర్ సినిమాస్ కు వెళ్లారు. బాహుబలి-2 సినిమా చూడటానికి సీఎం దాదాపు రూ. 50 వేలు ఖర్చు చేసి 48 టిక్కెట్లు బుక్ చేసుకున్నారని తెలిసింది.

దుమ్మెత్తిపోశారు

దుమ్మెత్తిపోశారు

పరబాషా చిత్రం చూడటానికి ఏకంగా సీఎం సిద్దరామయ్య ఒక్కో టిక్కెట్ రూ. 1,050 ఖర్చు చేసి చూశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సాక్షాత్తు సీఎం తెలుగు సినిమా టిక్కెట్ కు అంత ధర చెల్లిస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కన్నడ సంఘాలు సీఎం తీరుపై మండిపడ్డాయి.

బాహుబలి-2 తెలుగు సినిమా అనే

బాహుబలి-2 తెలుగు సినిమా అనే

పరాబాష చిత్రం బాహుబలి-2 చూడటానికి సీఎం రూ. 50 వేలు వరకు ఖర్చు చేశారని ఆరోపణలు రావడంతో సిద్దరామయ్య ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే ఫైల్ తెప్పించుకున్న సీఎం సిద్దరామయ్య ఇక మల్టీఫ్లెక్స్, అన్ని సినిమా థియేటర్లలో రూ. 200 కంటే ఎక్కువ ధరకు టిక్కెట్లు విక్రయించరాదని జీవో జారీ చేశారు. అంతే కాకుండా ప్రతి మల్టీ ఫ్లెక్స్ లోని ఓ స్క్రీన్ లో మద్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కచ్చితంగా కన్నడ సినిమాలే ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు.

English summary
Karnataka: The State government issued an order reducing ticket rates in multiplexes to Rs 200 on Tuesday(April 02).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X