వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: భార్య శీలంపై అనుమానంతో హత్య చేసిన భర్త, కోడలూ కొడుకూ సాయం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: థియేటర్ యజమానురాలు, సమాజ సేవకురాలి హత్య కేసులో ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. తుమకూరుకు చెందిన శ్రీనివాసరావ్ (60), ఆయన కుమారుడు సంతోష్(32), కోడలు లక్ష్మి (28) అనే ముగ్గురిని అరెస్టు చేశామని మంగళవారం జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి తెలిపారు.

The suicide case has become a murder case
తుమకూరులోని ఎంజీ రోడ్డులో శ్రీ కృష్ణ చిత్రమందిరం యజమానురాలు మాలిని రావ్ (53) సమాజ సేవకురాలు, ఈమె భర్త శ్రీనివాస్ రావ్ పెద్ద వ్యాపారవేత్త. రూ. కోట్లలో వ్యాపారాలు చేస్తుంటారు. ఈయన కుమారుడు సంతోష్ వ్యాపారం చేస్తున్నాడు.

మాలిని రావ్ సమాజ సేవ అంటూ ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళుతుండేది. ఈ విషయంపై శ్రీనివాసరావ్ భార్య శీలం మీద అనుమానం పెంచుకున్నాడు. 2011 ఫిబ్రవరి 6వ తేది సాయంత్రం శ్రీనివాస్ రావ్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన భార్యా మాలిని రావ్ ఇంటిలో లేరు.

అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మాలిని రావ్ ఇంటికి వచ్చారు. తరువాత శ్రీనివాస్ రావ్ ఎక్కడికి వెళ్లావని భార్యను నిలదీశాడు. మాలిని రావ్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ రావ్ కు కోపం వచ్చింది. తరువాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.

తరువాత కుమారుడు, కోడలితో కలిసి భార్య శవాన్ని బెడ్ రూంలో వేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. మరుసటి రోజు జీవితంపై విరక్తితో మాలిని రావ్ ఆత్మహత్య చేసుకుందని బంధువులు, పోలీసులను నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు మాలిని రావ్ కుటుంబ సభ్యులపై నిఘా వేశారు. పోలీసులకు అనుమానం వచ్చి విచారించారు. ముగ్గురు కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుని మాయమయ్యారు. అప్పటి నుండి పోలీసులు వీరి ముగ్గురి కోసం వివిధ రాష్ట్రాలలో, నగరాలలో గాలించారు.

మైసూరులోని సిద్దార్థ లేఔట్ లోని అపార్ట్ మెంట్ లో వీరు తలదాచుకున్నారని సమాచారం అందడంతో సోమవారం రాత్రి అరెస్టు చేశామని ఎస్పీ కార్తిక్ రెడ్డి తెలిపారు. భార్య శీలం మీద అనుమానంతో హత్య చేశానని శ్రీనివాస రావ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

English summary
February 7, 2011, Srinivas Rao, Malini's husband, informed Tumkur Town police that his wife Malini, then 53, had doused herself with kerosene and set herself ablaze.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X