బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనర్హత ఎమ్మెల్యేలకు షాక్, సీఎం ఆడియో టేప్ విచారణకు సుప్రీం కోర్టు ఓకే, అమిత్ షా!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: తమ మీద అనర్హత వేటు వేసిన అప్పటి కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ మీద సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్న అనర్హత ఎమ్మెల్యేలకు చుక్కెదురైయ్యింది. అనర్హత ఎమ్మెల్యేలు రాజీనామా చేసే విషయానికి సంబంధించి, ఆపరేషన్ కమల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మాట్లాడారు అంటున్న ఓ ఆడియో టేప్ ఇప్పుడు బీజేపీ వర్గాలను కలవరపెడుతోంది. సీఎం యడియూరప్ప ఆడియో టేపు వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది.

భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది!భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది!

అన్యాయం జరిగింది

అన్యాయం జరిగింది

ఎమ్మెల్యే పదవులకు తాము రాజీనామా చేసినా ఎలాంటి విచారణ చెయ్యకుండా అనవసరంగా తమ మీద అప్పటి కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేశారని, ఆయన ఏకపక్ష నిర్ణయం వలన తమకు అన్యాయం జరిగిందని, మీరే న్యాయం చెయ్యాలని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వులో పెట్టింది.

కపిల్ సిబల్ ఎంట్రీ

కపిల్ సిబల్ ఎంట్రీ

అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత కర్ణాటక సీఎం యడియూరప్ప మాట్లాడారు అంటున్న ఆడియో టేప్ ను ఈ విచారణకు స్వీకరించాలని, ఈ కేసులో ఈ ఆడియో టేప్ ను కీలక సాక్షంగా తీసుకోవాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి మనవి చేశారు. కోర్టు విచారణ చేసిన తరువాత ఈ కేసులో తమ చేతికి ఈ కీలక సాక్షం చిక్కిందని, మీరు దీనిని విచారణకు స్వీకరించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మనవి చేశారు.

సాక్షం బలంగా ఉంది

సాక్షం బలంగా ఉంది

కాంగ్రెస్ పార్టీ తరపున వాదనలు విన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ఈ విదంగా స్పందించారు. కపిల్ సిబల్ మీరు సీనియర్ న్యాయవాది, ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. అయితే మీరు చెబుతున్నట్లు ఈ అర్జీ విచారణ కేసులో ఆడియో టేప్ కీలక సాక్షం అంటున్నారు. అయితే రేపు (మంగళవారం) విచారణకు మరో ప్రత్యేక ధర్మాసం ఏర్పాటు చెయ్యాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాము మనవి చేస్తాం, మీరు ఐదు నిమిషాల్లో వాదనలు పూర్తి చెయ్యాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ కాంగ్రెస్ పార్టీ న్యాయవాది కపిల్ సిబల్ కు సూచించారు.

సిద్దరామయ్యకు సవాల్

సిద్దరామయ్యకు సవాల్

అనర్హత ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కారణం అని సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆరోపించారు. సుప్రీం కోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించరాదని, మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఉప ఎన్నికలకు సిద్దం కావాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సీఎం యడియూరప్ప సవాలు విసిరారు.

మీ కుర్చీ అక్కడే

మీ కుర్చీ అక్కడే

ఇక ముందు కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ప్రతిపక్షంలోనే ఉంటందని, సిద్దరామయ్య ఉన్నంత వరకూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప జోస్యం చెప్పారు. ఇలాంటి ఆడియో టేప్ వలన తన ప్రతిష్టకు ఎలాంటి హాని జరగదని, ఇది ఒక నకిలీ ఆడియో టేప్ అని సీఎం యడియూరప్ప అన్నారు.

ఆపరేషన్ కమలతో అమిత్ షాకు లింక్?

ఆపరేషన్ కమలతో అమిత్ షాకు లింక్?

ఇటీవల ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హుబ్బళ్ళిలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆ సమయంలో ఆపరేషన్ కమల విషయంలో కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా జోక్యం చేసుకున్నారని అని అన్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ఆడియో టేప్ ను విడుదల చేశారు. ఆపరేషన్ కమలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు రాజీనామా చేయించారని, అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణలో సీఎం యడియూరప్ప మాట్లాడారు అంటున్నఈ ఆడియో టేపు సాక్షంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయమవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో మనవి చేశారు.

English summary
News Delhi: The Supreme Court on Monday has agreed to consider BS Yediyurappa's audio on Operation Kamala as eveidence in disqualified MLAs case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X