వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం కోర్టును పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బాంబులు పెట్టి పేల్చేస్తామని గుర్తు తెలియని నిందితులు బెదిరింపు లేఖ పంపించారు. గుర్తు తెలియని ఒక ఈ -మెయిల్ ఐడి నుండి బెదిరింపు లేఖ వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. మంగళవారం సుప్రీం కోర్టులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సుప్రీం కోర్టులోకి వెలుతున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. న్యాయమూర్తులను మినహాయించి ప్రతి ఒక్క న్యాయవాదిని, సుప్రీం కోర్టు సిబ్బందిని పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. ఈ-మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

The Supreme Court

న్యాయమూర్తికి వార్నింగ్ ఇచ్చారు!

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ఉరి శిక్షకు గురైన యాకూబ్ మెమెన్ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అంతం చేస్తామని ఆగస్టు 7వ తేదిన బెదిరింపు లేఖ పంపించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

దీపక్ మిశ్రా ఇంటి దగ్గర పోలీసులను నియమించారు. ఇదే సమయంలో సుప్రీం కోర్టుకు బాంబు బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నిందితుడు యాకూబ్ మెమెన్ కేసు తీర్పు వెల్లడించాడనికి త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు.

ఆ త్రిసభ్య బెంచ్ లో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్లా సి. పంత్, జస్టిస్ అమితావ్ రాయ్ ఉన్నారు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు అర్దరాత్రి సుప్రీం కోర్టులో యాకూబ్ మెమెన్ అర్జీ విచారణ చేశారు. యాకూబ్ మెమెన్ క్షమాభిక్ష అర్జీని తిరస్కరించి ఉరి శిక్ష అమలు చెయ్యాలని తీర్పు ఇచ్చారు.

English summary
The Supreme Court of India today received an anonymous mail threatening the blow up the premises. A mail threatening to blow up the court was received this morning which has led to enhanced security in the Supreme Court of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X