
Supreme Court: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్, డిప్యూటీ స్పీకర్ కు నోటీసులు, ఏక్ నాథ్ హ్యాపీ !
న్యూఢిల్లీ/ముంబాయి: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండేకి సుప్రీం కోర్టు ఆదేశాలతో గుడ్ న్యూస్ వచ్చింది. ఏక్ నాథ్ షిండేతో పాటు శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మీద ఒత్తిడి తీసుకువచ్చింది. డిప్యూటీ స్పీకర్ శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని ప్రయత్నించారు.
MLAs: రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయి వెళ్లడానికి డేట్ ఫిక్స్ చేసిన ఏక్ నాథ్, మీ సెక్యూరిటీ భాద్యత నాదే !
అయితే శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యకూడదని డిప్యూటీ స్పీకర్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తమ మీద అనర్హత వేటు వెయ్యకుండా ఆదేశాలు జారీ చెయ్యాలని, శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు మావైపు ఉన్నారని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారని, మా మీద అనర్హత వేటు వెయ్యకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏక్ నాథ్ షిండే సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. సోమవారం ఏక్ నాథ్ షిండే సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యకుండా స్టే విధించింది. జులై 11వ తేదీకి విచారణ వాయిదా వేసింది.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారని, మా మీద అనర్హత వేటు వెయ్యకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏక్ నాథ్ షిండే సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. సోమవారం ఏక్ నాథ్ షిండే సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యకుండా స్టే విధించింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.