బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Actress: డ్రగ్స్ కేసులో హీరోయిన్ కు షాక్, నో బెయిల్ ,మళ్లీ వాయిదా, 90 డేస్ నాటౌట్, మేడమ్ కథ గోవిందా గోవింద !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ కేసులో చిక్కుకుని సెంట్రల్ జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి అలియాస్ రాగిణి ద్వివేది ఇక లాభం లేదని చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఆమెకు మాత్రం నిరాశ ఎదురైయ్యింది. ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టులో బెయిల్ మంజూరు కాకపోవడంతో ఎలాగైనా జైలు నుంచి బయటకు రావాలని రాగిణి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాగిణి డ్రగ్స్ సేవించినట్లు, డ్రగ్స్ సరఫరా చేసేవారితో ఆమెకు లింక్ ఉన్నట్లు మా దగ్గర సాక్షాలు ఉన్నాయని ఇంతకాలం వాదిస్తూ వచ్చిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుప్రీం కోర్టులో రాగిణికి బెయిల్ మంజూరు కాకుండా కౌంటర్ వేశారు. అయితే సుప్రీం కోర్టులో వాదనలు పూర్తి అయిన తరువాత రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో ముద్దుగుమ్మ షాక్ కు గురైయ్యింది.

Recommended Video

Telugu Heroine Anandhi Gets Married In Warangal | Oneindia Telugu

Beautiful lady: భర్తకు విడాకులు, ఇంట్లో తెలీకుండా ప్రియుడితో కాపురం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం!Beautiful lady: భర్తకు విడాకులు, ఇంట్లో తెలీకుండా ప్రియుడితో కాపురం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం!

 మూడు నెలల ముందు సీన్ రివర్స్

మూడు నెలల ముందు సీన్ రివర్స్

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో బహుబాష నటి, స్యాండిల్ వుడ్ హనీ బేబి రాగిణిని గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివార్లలోని యలహంకలోని రాగిణి ఇంటిలో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ లు సీజ్ చేశారు. రాగిణి బెడ్ రూమ్ లో పోలీసులు గంజాయితో నింపిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి రాగిణి ద్వివేదిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనేకసార్లు విచారణ చేశారు.

 పక్కా సాక్షాలు ఉన్నాయి

పక్కా సాక్షాలు ఉన్నాయి

సెప్టెంబర్ 14వ తేదీ నటి రాగిణి ద్వివేది పోలీసు కస్టడీ గడుపు పూర్తి కావడంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. తరువాత ఈ డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలు, తనకు బెయిల్ మంజూరు చెయ్యాలి అంటూ రాగిణి ఆమె తరపు న్యాయవాదులతో బెంగళూరులోని ఎన్ డీపీఎస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నటి రాగిణికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, ఆమె డ్రగ్స్ సేవించినట్లు మా దగ్గర సాక్షాలు ఉన్నాయని, ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో మనవి చేశారు.

హీరోయిన్ రాగిణి వాదన వేరే

హీరోయిన్ రాగిణి వాదన వేరే

నాకు ఏపాపం తెలీదు, ఈ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు బెయిల్ ఇవ్వండి అంటూ రాగిణి కోర్టును ఆశ్రయించింది. అయితే రాగిణికి ఈ పాపంతో సంబంధం ఉంది, బెయిల్ ఇవ్వకండి అంటూ బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించింది. అప్పటి నుంచి రాగిణ ద్వివేది బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకే పరిమితం అయ్యింది.

 సంజనా బచావ్

సంజనా బచావ్

బెంగళూరు డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ హీరోయిన్ రాగిణితో పాటు బహుబాష నటి సంజనా కూడా అరెస్టు అయ్యింది. నటి రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. రాగిణితో పాటు సంజనా, ఇదే కేసులో అరెస్టు అయిన కొందరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యం కారణంతో నటి సంజనా గల్రానీ బెయిల్ తీసుకుని ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చింది.

 సుప్రీం కోర్టుకు రాగిణి

సుప్రీం కోర్టుకు రాగిణి

బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి సంజనాతో పాటు మరికొందరు బెయిల్ మీద బయటకు వచ్చారు. స్యాండిల్ వుడ్ హీరోయిన్ నటి రాగిణి ద్వివేదికి బెయిల్ మంజూరు చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాగిణికి 30 ఏళ్లు అని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. డ్రగ్స్ కేసుకు, రాగిణి ఎలాంటి సంబంధం లేదని, ఆమెను కావాలనే కొందరు ఈ కేసులో ఇరికించారని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 వారం రోజులు నో చాన్స్

వారం రోజులు నో చాన్స్

న్యాయమూర్తి ఎల్. నాగేశ్వర్ రావ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ చేసింది. రాగిణి మీద కావాలనే తప్పుడు సాక్షాలతో కేసులు నమోదు చేశారని, ఆమెకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆమె తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో వాదించారు. ఇప్పటికే నటి రాగిణి అరెస్టు అయ్యి 90 రోజులు దాటిపోయిందని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని న్యాయవాదులు సుప్రీం కోర్టులో మనవి చేశారు.

 ఆసుపత్రి నుంచి సెంట్రల్ జైలు

ఆసుపత్రి నుంచి సెంట్రల్ జైలు

వాదనలు విన్న సుప్రీం కోర్టు రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. బెయిల్ రాకపోవడంతో నటి రాగిణి మరో వారం రోజులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇటీవల అనారోగ్యానికి గురైన నటి రాగిణి బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది మళ్లీ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లింది. అనారోగ్యం కారణంగా రాగిణికి బెయిల్ ఇప్పించాలని ఆమె తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టునులో వాదనలు వినిపిస్తున్నారు.

English summary
Actress Ragini: The supreme court on Friday adjourned the hearing to next week on a petition filed by actress Ragini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X